విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ డ‌బ్బు ఎవ‌రి జేబుల్లోకి వెళ్లింది, పోల‌వ‌రం నిర్వ‌హ‌ణ వారే అడిగారు : ఏపి ప్ర‌భుత్వం పై మోదీ..

|
Google Oneindia TeluguNews

ఏపి ప్ర‌భుత్వం ప్ర‌ధాని మోదీ నేరుగా కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఏపిలో సాధ‌నాల‌ను ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తుం ద‌ని ఆరోపించారు. అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నీతి ఆయోగ్ కోరితేనే తాము పోల‌వ‌రం ని ర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్టామ‌ని ముఖ్య‌మంత్రి చెబుతుంటే..ప్ర‌ధాని దీనికి భిన్నంగా స్పందించారు. తాము ఇచ్చిన డ‌బ్బు ఎవ‌రి జేబుల్లోకి వెళ్లింద‌ని ప్ర‌శ్నించారు..

యుసిలు ఇవ్వ‌లేదు..ఏపినే అడిగింది..

యుసిలు ఇవ్వ‌లేదు..ఏపినే అడిగింది..

ప్ర‌ధాని మోదీ ఏపి ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డినా..తాను చెప్ప‌ద‌ల‌చుకుంది చాలా స్ప‌ష్టంగా చెప్పేసారు. విశాఖ పార్లమెం ట్‌ నియోజకవర్గ కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపిలో సాధ‌నాల‌ను ప్ర‌భుత్వం దుర్వి నియోగం చేస్తుంద‌ని ఆరోపించారు. తాము సాయం అందించినా అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తుంద‌ని విమర్శించారు. కేంద్ంర నుండి 20 వేల కోట్ల వ‌ర‌కు రిసోర్స్ గ్యాప్‌..రెవిన్యూ లోటు భ‌ర్తీ కోసం నిధులు విడుద‌ల చేసామ‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు యుటిలైజేష‌న్ ప‌త్రాలు

ఇప్ప‌టి వ‌ర‌కు యుటిలైజేష‌న్ ప‌త్రాలు

ఏపి ప్ర‌భుత్వం త‌మ‌కు అంద‌లేద‌ని చెబుతోంద‌ని..ఆ డ‌బ్బు ఎవ‌రి జేబుల్లొకి వెళ్లంద‌ని ప్ర‌ధాని ప్ర‌శ్నించారు. వెనుక బ‌డిన జిల్లాల‌కు వెయ్యి కోట్లు ఇచ్చామ‌ని..అయితే, ఏపి ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు యుటిలైజేష‌న్ ప‌త్రాలు ఎందుకు ఇవ్వ‌టం లేద‌ని ప్ర‌ధాని ప్ర‌శ్నించారు. వాస్తవంగా ప్ర‌ధాని ఈ నెల 6న ఏపి ప‌ర్య‌ట‌న‌కు రావాల్సి ఉంది. అయితే,ఆ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో..ప్ర‌ధాని పార్టీ కార్య‌క‌ర్త‌ల వీడియో కాన్ఫిరెన్స్‌లో ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు.

పోల‌వ‌రం నిర్వ‌హ‌ణ వారే కోరారు..

ఇదే వీడియో కాన్ఫిరెన్స్‌లో ప్ర‌ధాని పోల‌వ‌రం ప్రాజెక్టు పైనా మాట్లాడారు. జాతీయ ప్రాజెక్టుగా పోల‌వ‌రం ఖ‌రారు చేసి పూర్తి నిధులు ఇస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రి ప‌లు సంద‌ర్భాల్లో నీతి అయోగ్ సూచ‌న మేర‌కు కేంద్రం త‌మ‌కు ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింద‌ని చెబుతూ వ‌చ్చారు. అయితే, దీనికి భిన్నంగా ప్ర‌ధాని స్పందించారు. పోల‌వ‌రానికి కేంద్రం వంద శాతం డ‌బ్బులు ఇస్తోంద‌ని..ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు వేల కోట్లు ఇచ్చా మ‌ని వివ‌రించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ చేస్తామ‌ని ఏపి ప్ర‌భుత్వం అడిగింద‌ని ప్ర‌ధాని వివ‌రించారు. అయితే, ఏపి ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టును నిర్వ‌హించ‌లేక పోతోంద‌ని కాగ్ రిపోర్ట్ చెప్పింద‌ని మోదీ గుర్తు చేసారు. కార్య‌క‌ర్త‌ల వీడియె కాన్ఫిరెన్స్‌లో విశాఖ‌తో పాటుగా.. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

English summary
Prime minister Modi revealed Assistance details for AP in party volunteers video conference. P.M says central govt given 20, 000 cr for ap as revenue gap and resource gap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X