రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరెంతో సాధించాలి: ఏపీ ఉపాధ్యాయినికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కార గ్రహీత మేకా సుసత్య రేఖపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె సేవలను కొనియాడుతూ ట్వీట్ కూడా చేశారు. చిన్నారులకు అర్ధమయ్యేలా ఆసక్తికరంగా గణితం, సైన్స్ బోధిస్తున్నారని కొనియాడారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.

కాగా, సుసత్య రేఖ కుటుంబంలో అందరూ ఉపాధ్యాయులే. అమ్మ సత్యవతి దేవి, తాత వెంకన్న చౌదరి హిందీ పండిట్లుగా, తండ్రి సత్యనారాయణ సోషల్ టీచర్‌గా రిటైర్ అయ్యారు. భర్త గురయ్య, అక్క ఇంద్రాణి, బావ వీరన్న, చెల్లెలు పద్మజారాణి, మేనమామ సత్యనారాయణ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

కుటుంబంలో మొదటిసారిగా తమ కుమార్తె జాతీయ పురస్కారం సాధించడం ఆనందంగా ఉందని సుసత్య రేఖ తల్లి సత్యవతి దేవి తెలిపారు. సుసత్య రేఖ విద్యాభ్యాసం మండపేట, ధవళేశ్వరం, రాజమహేంద్రవరంలలో జరిగింది.

narendra modi praises teacher susatya rekha

ఆమె ప్రస్తుతం పని చేస్తున్న నివేదిత కిశోర్ విహార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల సహచర ఊపాధ్యాయినీ, ఉపాధ్యాయులు సుసత్యకు అభినందనలు తెలిపారు. కాగా, సుసత్య రేఖ 1991 జులైలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. ఆటల ద్వారా పిల్లలకు అర్ధమయ్యే రీతిలో సులభంగా లెక్కలు బోధించడం ఆమె ప్రత్యేకత.

English summary
Prime Minister Narendra Modi praised Mathematics Teacher Susatya Rekha, who is belongs to Rajahmundry, in Andhra Pradesh state, during teacher's day celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X