వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేణుకా చౌదరిపై మోడీ సెటైర్లు: "టిడిపి ఎంపీలు తోక ముడిచారు"

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెసు సభ్యురాలు రేణుకా చౌదరిపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు పార్లమెంటు సభ్యుల ఆందోళన మధ్య ప్రధాని బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు.

Recommended Video

Renuka Chowdhary 'Surpanakha' Video

కాంగ్రెసు తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెసు అవసరం లేదని మహాత్మా గాంధీయే చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెసు లేని భారత్ అనే నినాదం తనది కాదని, గాంధీజీదేనని ఆయన అన్నారు.

మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెసు...

మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెసు...

ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెసు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వారిని వారించారు. ఏదైనా సమస్య ఉంటే వైద్యుడి వద్దకు వెళ్లాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరికి మోడీ సూచిస్తూ వ్యంగ్యంగా అన్నారు.

రేణుకా చౌదరి నవ్వడంతో..

రేణుకా చౌదరి నవ్వడంతో..

ఆ తర్వాత మోడీ ప్రసంగం వింటూ రేణుకా చౌదరి పెద్దగా నవ్వారు. దానికి ప్రధాని స్పందించారు. అప్పట్లో రామాయణం సీరియల్‌లో అలాంటి నవ్వులు విన్నామని ఇప్పుడు మరోసారి వింటున్నామని అన్నారు. మోడీ వ్యంగ్యాస్త్రాలకు బిజెపి ఎంపీలు హర్షధ్వానాలు చేశారు.

టిడిపి ఎంపీలు అడ్డుకోకుండా...

టిడిపి ఎంపీలు అడ్డుకోకుండా...

లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని అడ్డుకోకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు తోక ముడవడం ఆంధ్రులకు అవమానమని ఎపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. ఎపికి ఏమీ ఇచ్చేది లేదని మోడీ పరోక్షంగా చెప్పారని ఆయన అన్నారు.

చంద్రబాబు ద్వంద్వ విధానం విడనాడాలి

చంద్రబాబు ద్వంద్వ విధానం విడనాడాలి

రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబు ద్వంద్వ విధానాన్ని విడనాడాలని, రేపటి బంద్‌కు మద్దతు ప్రకటించాలన శివాజీ ్న్నారు. మూడు రోజులుగా పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా ప్రధాని తన ప్రసంగంలో ఎపి గురించి ఏమీ మాట్లాడకపోవడంపై నిరసన తెలుపుతూ గురువారం ఎపి రాష్ట్ర బంద్కు ఆయన పిలుపునిచ్చారు.

English summary
PM Narendra Modi made comments against Congress Rajya Sabha member Renuka Chowdhury in his speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X