చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత రత్న అవార్డు జాబితాలో ఎస్పీ బాలుకు చోటు: దక్షిణాది నుంచి: ఆయనను మించిన అర్హుడెవరు?

|
Google Oneindia TeluguNews

అమరావతి: దివికేగిన అమర గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు ఈ సారి భారత రత్న అవార్డు జాబితాలో చేర్చాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకునే అన్ని అర్హతలు ఎస్పీ బాలుకు ఉన్నాయని, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆయన పేరును ఎంపిక చేయాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. 16 భారతీయ భాషల్లో 40 వేలకు పైగా పాటలను పాడిన ఎస్పీ బాలును మించిన అర్హులెవరూ ఉండబోరని అంటున్నారు.

ఎస్పీ బాలు..ద లాస్ట్ లెజెండ్: కారణజన్ముడు: ఆ సమున్నత శిఖరాన్ని అందుకోవడం.. ఎవరితరం?ఎస్పీ బాలు..ద లాస్ట్ లెజెండ్: కారణజన్ముడు: ఆ సమున్నత శిఖరాన్ని అందుకోవడం.. ఎవరితరం?

కరోనా వైరస్ బారిన పడి, అనారోగ్యానికి గురైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కిందటి నెల 5వ తేదీన ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం విషమించింది. డాక్టర్లు ఆయనకు ఎక్మో చికిత్సను అందిస్తూ వచ్చారు. మధ్యలో ఆయనకు కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్ రావడం, ఆరోగ్యం మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో వస్తారని కోట్లాదిమంది అభిమానులు ఆశించారు. వారి ఆశలు ఫలించలేదు. ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించడంతో కన్నుమూశారు.

 Nation demands Bharat ratna for the legendary singer SP Balasubrahmanyam, Social media erupts

శనివారం ఉదయం 10:30 గంటలకు ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. చెన్నై శివార్లలోని తామరైపాక్కంలో గల ఎస్పీ బాలు ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియల కార్యక్రమాన్ని చేపట్టారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. ఎస్పీ బాలు సొంత జిల్లా నెల్లూరుకు చెందిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ ఏపీ ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

ఇదిలావుండగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారత రత్న అవార్డును ప్రకటించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. Bharat Ratna హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. భారత రత్నఅవార్డును అందుకునే అన్ని అర్హతలు ఎస్పీ బాలుకు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. తమ అభిప్రాయాలతో కూడిన పోస్టింగులలను ప్రధానమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేస్తున్నారు. దీన్నొక ఉద్యమంలా తీసుకెళ్తామనీ దక్షిణాది భాషల చలనచిత్ర పరిశ్రమ పెద్దలు, అభిమానులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల జాబితాలో ఆయన పేరును చేర్చాలనీ డిమాండ్ చేస్తున్నారు.

Recommended Video

SP Balasubrahmanyam Last Rites By Tamilnadu Govt ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు, పోటెత్తిన జనం...!

English summary
SP Balasubrahmanyam deserves Bharat Ratna and he is the one who spent his entire life on the universe of music, social media erupts. Nation demands Bharat Ratna for the legendary singer SP Balasubrahmanyam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X