అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ కు జాతీయ మహిళా కమిషన్ సూచన: నేడు అమరావతిలో పర్యటన: సుమోటోగా విచారణ..!

|
Google Oneindia TeluguNews

అమరావతిలో జరుగుతన్న పరిణామాలను జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా విచారణకు స్వీకరించింది. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళా రైతుల పైన పోలీసులు దాడులు చేసారని..కమిషన్ ఛైర పర్సన్ రేఖా శర్మకు ట్వీట్ చేసారు. దీంతో..కమిషన్ ఈ వ్యవహారాన్ని సుమోటాగా స్వీకరించి విచారణకు సిద్దమైంది. దీంతో...కమిషన్ లో ముగ్గురు సభ్యుల బృందం శనివారం అమరావతి గ్రామాల్లో పర్యటించనుంది. ఆందోళనలు చేస్తున్న మహిళలను కలిసి..వారి నుండి సమాచారం సేకరించనుంది. పోలీసుల దాడికి సంబంధించిన అంశాలపైన ఆరా తీయనుంది. ఇదే సమయంలో పోలీసు స్టేషన్లలో ఉంచిన మహిళలను సాయంత్రం ఇంటికి పంపించమని మీ పోలీసుకు చెప్పండంటూ సీఎం జగన్ కు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సూచించారు.

అమరావతికి జాతీయ మహిళా కమిషన్..
అమరావతి నుండి రాజధాని తరలింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆ ప్రాంత గ్రామాల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అక్కడ జరుగుతున్న ఆందోళనల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే , తాజాగా పోలీసులు కొందరు మహిళలపైన దాడి చేసారంటూ.. దానికి సంబంధించిన వీడియోలను జాతీయ మహిళా కమిషన్ కు ట్వీట్ చేసారు. వీటిని పరిశీలించిన తరువాత దీని పైన జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని సుమోటాగా స్వీకరిస్తున్నామంటూ ట్వీట్ చేసారు. దీని పైన తమ కమిషన్ లోని ముగ్గురు సభ్యుల బృందం శనివారం అమరావతి గ్రామల్లో పర్యటించి వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోలను ఛైర్ పర్సన్ ట్యాగ్ చేసారు. దీంతో..కమిషన్ లోని సభ్యుల బృందం పర్యటన ద్వారా ఇప్పుడు ఈ వ్యవహారం పైన జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.

National women commission members team visiting Amaravati to day

ముఖ్యమంత్రి జగన్ కు సూచనలు..
ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ కు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సూచన చేసారు. పోలీసు స్టేషన్లలో ఉన్న మహిళలను సాయంత్రం ఇంటికి పంపించమని మీ పోలీసులకు చెప్పాలంటూ నేరుగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సూచించారు. ట్వీట్ ద్వారా ఈ సూచన చేసారు. అమరావతి అంశంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను సాయంత్రం ఆరు దాటిన తరువాత పోలీస్ స్టేషన్లలో ఉంచారంటూ తనకు వందలాది సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం పైన జాతీయ మహిళా కమిషన్ సమోటోగా స్వీకరించి విచారణ చేయటం.. కమిషన్ సభ్యులు అమరావతి గ్రామాల్లో పర్యటించటం తో ..ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంటోంది.

English summary
Nataional women commission chair person Rekha Sharma responded on Amravati agittaion and local police attacks on women farmers. Committee members visiting Amaravati and decided to investigatigate as sumoto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X