వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎం మోడీతో వీడియోకాన్ఫరెన్స్ లో విశాఖ దంపతులు.. వారికి జాతీయ గుర్తింపు తెచ్చిన 60 గజాల్లో కట్టిన ఇల్లు

|
Google Oneindia TeluguNews

విశాఖకు చెందిన దంపతులకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం లభించింది. విశాఖ గాజువాక లోని ఉప్పర కాలనీకి చెందిన ఎస్ దుర్గ, అప్పన్న బాబు దంపతులు చేసిన పని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురాగా, నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. ఇంతకీ వారు ఏం చేశారంటే..

Recommended Video

60 గజాల్లో ఇల్లు కట్టి ప్రధాని మోదీ దృష్టిని ఆకర్శించిన విశాఖ దంపతులు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొద్దిపాటి స్థలంలోనే అన్ని వసతులతో ఇల్లు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొద్దిపాటి స్థలంలోనే అన్ని వసతులతో ఇల్లు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొద్దిపాటి స్థలంలోనే అన్ని వసతులతో చక్కని అందమైన ఇంటిని వారు నిర్మించుకున్నారు. వారు నిర్మించిన ఇల్లు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. పదిమంది మెచ్చుకునేలా అతి తక్కువ ఖర్చులో, తక్కువ స్థలంలో , అన్ని వసతులతో, చూడచక్కని ఇంటి నిర్మాణం చేసిన వీరు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించారు. జాతీయ స్థాయిలో వీరు నిర్మించుకున్న ఇంటికి గుర్తింపు దక్కడంతో వీరి గురించి అందరికీ తెలిసేలా చేయాలని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ దంపతులతో మాట్లాడనున్నారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఇక ఆ డబ్బుతో కలిపి, మరి కొంత డబ్బును వెచ్చించి, కొద్దిపాటి స్థలంలో వారు గృహ నిర్మాణం చేశారు. అంతకుముందు ఇల్లు లేక నానా అవస్థలు పడ్డారు దుర్గ దంపతులు. నిరుపేద కుటుంబం కావడంతో ఇల్లు కట్టుకోవాలనే సొంతింటి కల తీర్చుకోవడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం వారికి ఎంతగానో ఉపయోగపడింది. ఈ క్రమంలోనే చక్కనైన ఇంటిని నిర్మించుకున్న వారితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరే౦ద్రమోదీ మాట్లాడనున్నారు.

ఇన్నోవేటివ్ విభాగంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఇల్లు

ఇన్నోవేటివ్ విభాగంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఇల్లు

ఇక ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారుల నుండి దుర్గ కు సమాచారం అందించారు. తక్కువ స్థలంలో చక్కని ఇల్లు కట్టుకున్న దుర్గ కథ అందరికీ తెలియాలని ఉద్దేశంతో నేడు ఆమెను ప్రధానమంత్రి మోడీ తో మాట్లాడడానికి ఉత్తమ లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం విశాఖ నగరంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇంటిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది కేవలం 60 గజాల స్థలంలోనే నిర్మించిన ఇంటికి ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ విభాగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల దుర్గ దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త సంవత్సరం తొలిరోజే గుర్తుండిపోయేలా .. మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖ దంపతులు

కొత్త సంవత్సరం తొలిరోజే గుర్తుండిపోయేలా .. మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖ దంపతులు

ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడడం మొదట నమ్మలేకపోయాని, తమ ఇంటికి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందని ప్రతి ఒక్కరు అడుగుతుంటే గర్వంగా ఉందని దుర్గ చెప్తున్నారు. ఇల్లు కట్టుకున్న ఆనందం ఒకపక్క, తమ ఇంటికి జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది అన్న సంతోషం మరోపక్క, ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా ఓ నిరుపేద కుటుంబం అయిన తమతో మాట్లాడటం ఇంకోపక్క వారి ఆనందానికి కారణం అవుతున్నాయి . ఏదేమైనా విశాఖలోని ఈ దంపతులకు, న్యూ ఇయర్ తొలిరోజే ప్రధానమంత్రి మోడీ తో మాట్లాడడం నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోయే అంశం.

English summary
S Durga and Appanna Babu, a couple from Visakhapatnam, speaking with PM Modi today in a video conference beacause of their innovative house constructed under Prime Minister's Awas Yojana scheme. The house is now nationally recognized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X