వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రుల‌కు న‌వీన్ ప‌ట్నాయ‌క్ హ్యాండ్ : మేము వారితో క‌ల‌వం : బిజెడి నిర్ణ‌యం ఏంటంటే..

|
Google Oneindia TeluguNews

జాతీయ రాజ‌కీయాల్లో కూట‌ములు..ఎవ‌రికి మ‌ద్ద‌తిచ్చే అంశం పై బిజెపి అధినేత..ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ స్ప‌ష్ట‌త ఇచ్చేసారు. కొద్ది రోజుల క్రితం బిజెపి ఎంపి ఏపి ముఖ్య‌మంత్రిని క‌లిసారు. చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ప్ర క‌టించార‌ని టిడిపి నేత‌లు చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేస్త‌న్న ప్ర‌య‌త్నాల‌కు వ్య‌తిరేకంగా బిజెడి చంద్ర‌బాబు కు ద‌గ్గ‌ర అవు తోంద‌ని విశ్లేష‌ణ‌లు జ‌రిగాయి. అయితే, తాజాగా న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌క‌ట‌న‌తో వారి వైఖ‌రి స్ప‌ష్ట‌మైంది.

ఆ రెండు కూట‌ముల్లో చేరము...

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌- బిజెపి మ‌ద్ద‌తు కూట‌మ‌లు ఏర్ప‌డుతున్నాయి. ఈ రెండు పార్టీల‌తో సంబంధం లేకుండా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కేసీఆర్ భువ‌నేశ్వ‌ర్ వెళ్లి ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో స‌మావేశ‌మ‌య్యారు. కాంగ్రెస్ - బిజెపీత‌ర ఫ్రంట్ గా ఏర్ప‌డుదామ‌ని..క‌లిసి రావాల ని పిలుపునిచ్చారు. అయితే, న‌వీన్ ప‌ట్నాయ‌క్ త‌న ఆలోచ‌న బ‌య‌ట పెట్ట‌లేదు. ఆ వెంట‌నే బిజెడి ఎంపి అమరావ‌తి వ‌చ్చి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసారు. చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌ను అభినందించారు. దీంతో..ఒడిశా ముఖ్య మంత్రి దూత‌గా ఆయ‌న వ‌చ్చార‌ని..ఒక బిజూ జ‌న‌తా ద‌ళ్ సైతం కాంగ్రెస్ మ‌ద్ద‌తు కూట‌మిలో చేరుతుంద‌ని ప‌లువు రు అంచ‌నా వేసారు. టిడిపి నేత‌లు సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేసారు.

Naveen Patnaik on Neutral stand : dont support Congress and Bjp..

త‌న స్టాండ్ స్ప‌ష్టం చేసిన న‌వీన్ ప‌ట్నాయ‌క్‌

జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయతలపెట్టిన మహా కూటమిలో చేరే ఆలోచన లేదని బిజు జనతా దళ్ అధినేత,ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.కాంగ్రెస్ ఆద్వర్యంలోని యుపిఎలోకాని, బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ. లో కాని చేరబోమని ఆయన చెప్పారు. దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు బీజేడీ దూరంగా ఉండి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఇదే స‌మ‌యంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరుతారా లేదా అనే అంశం పై మాత్రం స్ప ష్ట‌త ఇవ్వ‌లేదు. కాంగ్రెస్ - బిజెపి కూట‌ముల‌కు మ‌ద్ద‌తు లేద‌ని చెప్ప‌టం ద్వారా మ‌రి..ఆయ‌న త‌ట‌స్థ వైఖ‌రితోనే ఉంటారా..లేక కేసీఆర్ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తారా అనేది చూడాల్సి ఉంది.

English summary
BJD chief and Odissa C.M Naveen patanaik clarified his stand on national politics. He says BJD not go with congress and NDA Alliance. BJD will be neutral in national politics said by Mr Naveen Patnaik.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X