వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్డర్లీ వ్యవస్థకు అంతం: మంత్రి నాయని హామీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసు శాఖలో హోంగార్డులది కీలక పాత్ర అని, కొంత మంది పోలీసు అధికారుల ఇళ్లలో హోంగార్డులతో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారని తెలిసిందని, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఆర్డర్లీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తామని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.

ఉద్యోగ భద్రత లేక హోంగార్డులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ సంక్షేమ సంఘం మొదటి సమావేశం మంగళవారం మధ్యాహ్నం రవీంద్ర భారతిలో జరిగింది. సమావేశానికి తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, డిఐజి అజయ్‌కుమార్ హాజరయ్యారు.

హోంగార్డుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాయని నర్సింహా రెడ్డి అన్నారు. ప్రధానంగా హోంగార్డుల జీత భత్యాలు చాలా తక్కువగా ఉన్నాయని, దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

హోంగార్డులకు ఇళ్ల స్థలాలు

హోంగార్డులకు ఇళ్ల స్థలాలు

హోంగార్డులకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని మంత్రి నాయని నర్సింహా రెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే బస్సు పాస్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జీతాల వ్యత్యాసం తగ్గిస్తాం

జీతాల వ్యత్యాసం తగ్గిస్తాం

కానిస్టేబుల్, హోంగార్డుల మధ్య ఉన్న జీతాల వ్యత్యాసాన్ని తగ్గిస్తామని మంత్రి నాయని నర్సింహా రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చి 60 రోజులే అయిందని, దశలవారీగా ఐదేళ్లలో హోంగార్డుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పోలీసు సంక్షేమానికి..

పోలీసు సంక్షేమానికి..

పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయని నర్సింహా రెడ్డి చెప్పారు. అదేవిధంగా పోలీసులు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.

హోంగార్డుల పట్ల వైఖరి మారాలి

హోంగార్డుల పట్ల వైఖరి మారాలి

పోలీసు అధికారుల్లో హోంగార్డులను చూసే విధానం మారాలని మంత్రి నాయని నర్సింహా రెడ్డి చెప్పారు. తెలంగాణలో ప్రజా పోలీసు వ్యవస్థను తెస్తున్నామని, అందుకు పోలీసులు సహకరించాలని కోరారు.

గుండాయిజానికి చెక్

గుండాయిజానికి చెక్

హైదరాబాద్‌లో గుండాయిజం, రౌడీయిజం ఉండేందుకు వీల్లేదని, మహిళ భద్రత అందరి బాధ్యత అని నాయని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు.

హామి దొరికింది..

హామి దొరికింది..

సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హోంగార్డుల సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. హోంగార్డులకు ప్రభుత్వ నుంచి ఇళ్లు, వైద్యం, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

హోంగార్డులు వెన్నెముక..

హోంగార్డులు వెన్నెముక..

హోంగార్డులు పోలీసు వ్యవస్థకు వెన్నుముకలాంటి వారన్నారు. విధి నిర్వహణలో హోంగార్డులు క్రమశిక్షణ పాటించాలని డిఐజి అజయ్‌కుమార్ సూచించారు. హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమావేశంలో వీరంతా..

సమావేశంలో వీరంతా..

తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ సభాధ్యక్షతన జరిగిన సమావేశంలో పోలీసు అధికారుల సంఘం నేతలు గోపిరెడ్డి, శంకర్‌రెడ్డిలతోపాటు హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

English summary
Telangana home minister Nayani Narsimha Reddy assured home guard abolishon of orderly system in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X