• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో దారుణం: ఆడవాళ్లను అంగడి సరుకులా - ఆర్థిక నేరాల్లో టాప్ - ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులో సంచలనాలు

|

దేశంలో వివిధ రకాల నేరాలకు సంబంధించి జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా 2019 సంవత్సరానికి సంబంధించిన నివేదికను వెలువరించింది. అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వెల్లడైన పలు సంచలన గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేసేలా ఉన్నాయి. ఓవరాల్ గా నేరాల్లో ఏపీ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలవగా.. కీలకమైన ఆర్థిక నేరాల్లో మాత్రం టాప్ లో ఉండటం, మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానంలో నిలవడం కలకలం రేపుతున్నది.

జగన్ అనుంగులు ఆ డ్రగ్స్ వాడతారు - ముగ్గురికి జైలు ఖాయం - 7కొండలు-7రెడ్లు: రఘురామ మరోబాంబుజగన్ అనుంగులు ఆ డ్రగ్స్ వాడతారు - ముగ్గురికి జైలు ఖాయం - 7కొండలు-7రెడ్లు: రఘురామ మరోబాంబు

2019 చివరి నాటికి ఇలా..

2019 చివరి నాటికి ఇలా..

ఎన్‌సీఆర్‌బీ తాజా రిపోర్టులో 1995 నుంచి 2019 డిసెంబర్ చివరి నాటికి నమోదైన నేరాలను పరిగణలోకి తీసుకున్నారు. 2019 మేలో ఏపీలో జగన్ అధికారంలోకి రాగా, ఆ ఏడాది మొత్తంగా రాష్ట్రం ఆర్థిక నేరాల్లో అగ్రగామిగా నిలిచింది. గతేడాది ఏపీలో రూ.50 కోట్ల నుంచి 100కోట్లు మోసానికి పాల్పడిన కేసులు ఏకంగా 30 నమోదయ్యాయి. ఇది దేశంలోనే ఇది అత్యధికమని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. నమ్మకద్రోహం, ఫోర్జరీ, చీటింగ్‌, ఫ్రాడ్‌ తదితర మోసాలకు సంబంధించి నిందితులు, బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది.

జనాభా తక్కువే అయినా..

జనాభా తక్కువే అయినా..

ఆర్థిక, పారిశ్రామిక వృద్ధిలో అగ్రరాజ్యాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడును తోసిరాజని.. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక నేరాలు విస్తృతంగా చోటుచేసుకుకోవడం గమనార్హం. మహారాష్ట్రతో పోల్చుకుంటే సగం జనాభా కూడా లేని ఏపీలో.. ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోన్న నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్య తరగతి ప్రజలకు అత్యాశ చూపి మోసం చేస్తున్న వైనాలు భారీగా బయటపడ్డాయి. వాటిలో అగ్రిగోల్డ్‌ కేసు ప్రధానమైనది కాగా, డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలకు పాల్పడిన ‘వెల్‌ పే' లాంటి సంస్థల పాత్ర కూడా ఉంది. రూ.50 కోట్ల నుంచి 100కోట్లు మోసం చేసిన కేసులు.. గతేడాది మహారాష్ట్రలో ఐదు మాత్రమే నమోదు కాగా, ఏపీలో వాటి సంఖ్య 30గా ఉండటం గమనార్హం. అదే సమయంలో...

చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజేచంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

  Facebook, Twitter, Instagram లో పర్సనల్స్ , ఫొటోస్ పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా ? | Sandeep Mudalkar
  పెరిగిన మహిళల అక్రమరవాణా

  పెరిగిన మహిళల అక్రమరవాణా

  ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏపీలో మహిళలను అంగడి సరుకులుగా విక్రయించే ముఠాల కార్యకలాపాలు పెరిగాయి. మహిళల అక్రమ రవాణా, విక్రయాల్లో మహారాష్ట్ర టాప్ లో ఉండగా, అక్కడి గ్యాంగుల కార్యకలాపాలు ఏపీకి సైతం విస్తరించినట్లు నివేదికలో వెల్లడైంది. ఏపీలో మూడేళ్లుగా మానవ అక్రమ రవాణా క్రమంగా పెరుగుతూ, 2019లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మహిళలు, మానవ అక్రమ రవాణాలో మహారాష్ట్ర 12.5శాతంతో అగ్రస్థానంలో ఉండగా 10.8శాతంతో ఏపీ తర్వాతి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 398మంది మహిళలు, యువతులు గతేడాది అక్రమ రవాణాకు గురికాగా వారిలో 316మంది వ్యభిచార గృహాలకు అమ్ముడు పోయారని, వీటికి సంబంధించి కేసుల నిరూపణ శాతం తక్కువగా ఉందని, కేవలం 21.8 శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.

  English summary
  According to the National Crime Records Bureau (NCRB) - 2019 report, Andhra Pradesh is on the rise in economic crimes, while AP ranks second in women trafficking. In 2019, there were 30 cases of fraud ranging from Rs 50 crore to Rs 100 crore in AP. NCRB said it was the highest in the country.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X