వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెజవాడలో ఆవులపై విష ప్రయోగం..? గోశాలలో వంద ఆవుల మృతి..! విచారణ వేగవంతం చేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని సమీపంలో విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లి గోశాలలో మృత్యు ఘోష వినబడుతోంది. ఒక్కసారిగా 100 ఆవులు మృతి చెందడంతో పాటు.. మరికొన్ని ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. దీని పై అనేక రకాలుగా దాణాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోశాలలోనే వైద్యులు ఆవులకు చికిత్స అందిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత ఆవుల మృతికి కారణాలు తెలుస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఇదే గోశాలలో 24 ఆవులు మృతి చెందాయి.

Recommended Video

సింగరేణి కళాశాలలో ఫుడ్ పాయిజన్ .. 8 మంది విద్యార్థునిలకు అస్వస్థత

గోశాలలో వంద ఆవులు మృతి ...
విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. దీంతో...ఒక్క సారిగా కలకలరం మొదలైంది. రాత్రి వరకు ఆరోగ్యంగానే కనిపించిన ఆవులు తెల్లవారే సరికి మృతి చెందాయి. దీని పైన గోశాల నిర్వాహకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతిచెందిన ఆవులకు పోస్ట్‌మార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. మరికొన్ని పశువులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో కూడా ఇదే గోశాలలో పుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. 100 గోవులు చనిపోవడంపై గో సంరక్షణ కార్యదర్శి సాహు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధకరమన్నారు. రాత్రి సమయంలో పశువులకు వేసిన దాణా పాయిజనింగ్‌ అయి వుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Nearly 100 cowd died in Krishna District Go sala last night.

ఎక్కడ తప్పు జరిగింది...కారణాలేంటి..
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా వంద ఆవులు మృతి చెందటం చిన్న విషయం కాదు. గోశాల నిర్వాహకులు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతంలోనే 24 గోవులు చనిపోయిన తరువాత జాగ్రత్తలు తీసుకోవాల్సిన నిర్వాహకులు ఇప్పుడు మరో సారి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానా లో విషం కలిసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానా ఎవరు పెట్టారు.. గోశాల నిర్వాహకులు దానా విషయంలో ఎవరికి అనుమతి ఇచ్చారనే కోణంలో విచారణ సాగుతోంది. ఇక్కడ వంద ఆవులు మృతి చెందటం పైన గో సంరక్షణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి ఘటనలు జరగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Nearly 100 cowd died in Krishna District Go sala last night. Police filed case started investigation on this issue. Police suspecting poisining in food.mobile summary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X