వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నీతు అగర్వాల్‌కు షాక్, ఫోన్ల వివరాలు తెల్సుకోవాలి
కర్నూలు: ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న సినీ నటి నీతు అగర్వాల్ బెయిల్ పిటిషన్‌ను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ న్యాయస్థానం కొట్టువేసింది. శనివారం బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి.
ఈ కేసులో విచారణ పూర్తయిందని, నీతు అగర్వాల్‌కు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసులో విచారణ ఇంకా పూర్తిగా ముగియలేదని, మరో నలుగురిని అరెస్టు చేయవలసి ఉందని రుద్రవరం పోలీసుల తరఫున న్యాయవాది చెప్పారు.
నిందితురాలి ఫోన్ నుండి వచ్చిన, వెళ్లిన ఫోన్ల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ దశలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే విచారణ పైన ప్రభావం పడుతుందని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు నీతు అగర్వాల్‌కు బెయిల్ నిరాకరించింది.
Comments
neetu agarwal red sandalwood smugglers mastan vali ysr congress seshachalam encounter నీతూ అగర్వాల్ ఎర్ర చందనం దొంగలు మస్తాన్ వలీ వైయస్సార్ కాంగ్రెస్ శేషాచలం ఎన్కౌంటర్
English summary
Allagadda Court Rejected Neetu Agarwal Bail Petition
Story first published: Sunday, May 3, 2015, 12:39 [IST]