• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబు బదిలీ వెనక, ఆ భూముల కేటాయింపుపై సంతకం చేయాలని ఒత్తిడి, కాదనడంతో..

|

నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబును ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే అంతకు ఐదురోజుల ముందు ఆయన సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత కలెక్టర్ బదిలీ కావడం జిల్లాలో చర్చానీయాంశమైంది. అయితే కలెక్టర్ బదిలీకి అధికార పార్టీ నేతలు కారణమని తెలుస్తోంది. ఓ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో మాట వినకపోవడంతో బదిలీ చేయించినట్టు తెలుస్తోంది. సదరు పేపర్లపై సంతకం పెట్టాలని ఒత్తిడి తెచ్చారని.. లేదంటే సెలవులో వెళ్లిపోవాలని బెదిరించడంతో ఆయన వెళ్లిపోయారు. తర్వాత మరో అధికారి రాకముందే తమ పని దర్జాగా కానీచ్చేశారు.

జగన్ కు రఘురామ మరో ట్విస్ట్- పార్టీ వేరు, ప్రభుత్వం వేరు- అలా అయితే 20 ఏళ్ల అధికారం..

 పేదల ఇళ్ల కోసం..

పేదల ఇళ్ల కోసం..

నెల్లూరు జిల్లా కావలి సమీపం బుడంగుంట వద్ద గల 35 ఎకరాలు పేదల కోసం కొనుగోలు చేయాలని అధికారులు అనుకొన్నారు. ఇవీ వ్యవసాయానికి చెందిన భూములు కావడంతో ఎకరం ధర రూ.13 లక్షలుగా కూడా నిర్ణయించారు. ఈ భూముల్లో అంతగా సాగు కాకపోవడంతో విక్రయించేందుకు రైతులు అంగీకరించారు. భూముల పక్క గల 37 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని భావించారు. ఎకరానికి రూ. 27 లక్షలకు ఇవ్వడానికి రైతులు ఒప్పంద పత్రాలు కూడా ఇచ్చారు.

 ఆ భూములు వద్దు..

ఆ భూములు వద్దు..

భూముల కొనుగోలు ప్రక్రియ దాదాపు పూర్తి కాగా అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. సదరు భూములు టీడీపీ సానుభూతిపరులకు చెందినవని చెప్పి కొనకుండా అడ్డుకున్నారు. కావలి రైల్వే లైన్ అవతల వైపు తిప్ప పరిధిలో గల 115 ఎకరాలను ఇంటి స్థలాల కోసం ఎంపిక చేశారు. భూమిలో కొంత విస్తీర్ణణానికి గతంలో భూ వినియోగ మార్పిడికి అనుమతించారు. దీంతో ఆ భూమి మొత్తం విలువ పెరిగిపోయింది. లేదంటే రిజిష్టర్ ఆఫీసు రికార్డు ప్రకారం ఎకరం రూ.12 లక్షలు మాత్రమే వచ్చేది. కానీ ధర ఆమాంతం ఎకరాకు రూ.24 లక్షలు పెరిగింది.

 ఎకరం రూ.60 లక్షలు

ఎకరం రూ.60 లక్షలు

ఈ భూములను ఇంత ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురారు. కానీ పేదల ఇళ్ల కోసం కాబట్టి అధికారులు ధర పెట్టేందుకు ముందుకొచ్చారు. కానీ ఎకరం ధర రూ.60 లక్షలు అని చెప్పి.. రూ.55 లక్షలకు తగ్గించారు. తర్వాత కావలి భూముల్లో జరుగుతోన్న కుంభకోణం గురించి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కలెక్టర్ శేషగిరిబాబు ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. ఫైలు తన వద్దకు వచ్చినా పట్టించుకోలేదు. దీంతో అధికార పార్టీ నేతలు కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇదివరకు కలెక్టర్‌పై ఇద్దరు నేతలు దూషించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. సంతకం పెట్టు.. లేదంటే సెలవులో వెళ్లాలని బెదిరించడంతో ఆయన లీవ్‌లో వెళ్లిపోయారు.

సెలవులో ఉండగానే.. ట్రాన్స్‌ఫర్..

సెలవులో ఉండగానే.. ట్రాన్స్‌ఫర్..

ఈ నెల 8వ తేదీన సెలవు పెట్టగా.. 10వ తేదీన లీవు మంజూరయ్యింది. తర్వాత 15వ తేదీన మంత్రివర్గ సమావేశం జరిగింది. కలెక్టర్‌ను బదిలీ చేయాలని ప్రతిపాదన రావడంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే మరో కలెక్టర్ రాక ముందే ఎకరం భూమికి రూ.50 లక్షలు సిఫారసు చేసి జిల్లా నుంచి ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. మరో అధికారి ద్వారా భూమి రిజిస్ట్రేషన్‌ను అధికార పార్టీ నేతలు చేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

  Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu
   40 ఎకరాలు వారివే..

  40 ఎకరాలు వారివే..

  115 ఎకరాల భూమిలో 40 ఎకరాలు అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులవి అని సమాచారం. మిగిలిన 75 ఎకరాలు రైతులవి కాగా.. ఎకరానికి రూ.40 లక్షల కమీషన్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. అందుకు ఓకే చెప్పిన రైతుల భూములనే సేకరించారు. అంగీకరించిన రైతులవి వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది. అలా వదిలేసిన భూములు 30 ఎకరాల వరకు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

  English summary
  kavali land registration is not done by nellore collector seshagiri babu, he go to leave then govt transfer to another place.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X