• search
 • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మెడకు ఉరి.. ప్రియుడి కోసం ఆక్రందన.. సంచలనంగా డిగ్రీ విద్యార్థిని సూసైడ్.. నిందితులతో ఆమె సోదరుడు..

|

''నిన్ను చూడకుంటే నాకు మెంటలెక్కిపోతోంది... ప్లీజ్ రా.. ఫోన్ లిఫ్ట్ చెయ్.. నాతో ఒక్కసారి మాట్లాడు.. శివా.. నువ్వు ఫోన్ ఎత్తకుంటే.. నేను స్టూల్ ఎక్కుతా.. నువ్వు మాట్లాడకుంటే నేను ఉరిపోసుకుని చస్తా... ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు..'' అంటూ గంటన్నర వ్యవధిలో వందల మెసేజ్ లు పంపింది. ఆమె ఎంతగా ప్రాధేయపడినా ప్రేమికుడు వినిపించుకోలేదు. ప్రేమ, పెళ్లి పేరుతో మోసపోయానని గ్రహించిన ఆమె చివరిగా వీడియో కాల్ చేసి, అతను చూస్తుండగానే ఉరి బిగించుకుంది.

జగన్ కు భారీ షాక్..అంతే గట్టిగా రివర్స్ ఎటాక్ - నీటి ప్రాజెక్టులపై వేడి.. తాజా వరదతో టెన్షన్ తగ్గేనా

జిల్లాలో సంచలనం..

జిల్లాలో సంచలనం..

నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ సెల్ఫీ సంచలనంగా మారింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నెల్లూరు సిటీలోని బీవీనగర్‌లో ఉంటున్న వెంకటరాజు, సుబ్బమ్మ దంపతుల కుమార్తె రమ్య(21) ప్రైవేటు డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. వాళ్ల ఇంటికి సమీపంలో ఉండే శివభార్గవ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించిన శివ.. చివరికి మోహం చాటేయడంత బలవన్మరణానికిపాల్పడింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శివభార్గవ్, మరో ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు.

గంటన్నరలో వందల మెసేజ్‌లు..

గంటన్నరలో వందల మెసేజ్‌లు..

కొంతకాలంగా తనను దూరంపెడుతోన్న శివతో తాడోపేడో తేల్చుకోవాలనుకున్న రమ్య.. శుక్రవారం అతనితో మాట్లాడేందుకు విశ్వప్రయత్నం చేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు వందలకొద్ది మెసేజ్ లు పంపింది. ఒక్కసారి మాట్లాడాలంటూ ప్రాధేయపడినా, అటు నుంచి ఎంతకూ సమాధానం రాలేదు. దీంతో శివ స్నేహితులైన వాసు, సాయిలకు కూడా మెసేజ్ లు పంపింది. చివరి అస్త్రంగా.. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వీడియో కాల్ చేసింది. శివ చూస్తుండగానే మెడకు ఉరి బిగించుకుని, మాట్లాడాలంటూ ప్రాధేయపడుతూనే, స్టూల్ తన్నేసింది..

సాయిరెడ్డి మళ్లీ వేశారు.. బీజేపీ డోసిచ్చినా.. జగన్ రాజభవనాలపై టీడీపీ.. రఘురామపై మరో ఫిర్యాదు..

ఆ ముగ్గురిపై ఫిర్యాదు..

ఆ ముగ్గురిపై ఫిర్యాదు..

గదిలోకి వెళ్లిన కూతురు ఎంతకూ బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. రమ్య ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి, రమ్యను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ వెంటనే జిల్లా ఎస్పీ ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను ఆశ్రయించిన బాధిత కుటుంబం.. రమ్య పంపిన మెసేజ్‌లు, వీడియోలను ఆధారాలుగా పేర్కొంటూ, శివ, అతని ఇద్దరు స్నేహితులపై ఫిర్యాదు చేశారు. రమ్య సూసైడ్ సెల్ఫీ, శివ, చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ సమయంలో తమ్ముడు అక్కడే..

ఆ సమయంలో తమ్ముడు అక్కడే..

ఒకే కాలనీ కావడంతో నిందితులు ముగ్గురికీ రమ్యతోపాటు ఆమె సోదరుడితోనూ పరిచయం ఉంది. మాట్లాడకపోతే చనిపోతానంటూ రమ్య వీడియో కాల్ చేసి, ఉరి బిగుంచుకున్న సమయంలో.. శివ పక్కనే ఆమె సోదరుడు కూడా ఉన్నాడు. కానీ ఆమె చనిపోవడాన్ని కళ్లారా చూసి కూడా ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. ‘‘ఆ టైమ్ ను నేను కూడా వాళ్లతోనే ఉన్నాను. ఒక్కమాట చెప్పినా మా అక్క ప్రాణాలు కాపాడుకునేవాడిని..''అని రమ్య సోదరుడు వాపోయాడు.

  Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!
  గాలింపు ముమ్మరం..

  గాలింపు ముమ్మరం..

  రమ్య ప్రాణాలు కోల్పోయిందని, ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టారని తెల్సుకున్న వెంటనే మోసగాడు శివభార్గవ్ అజ్ఞాతంలోకి జారుకున్నాడు. అన్నీ చానెళ్లలోనూ వార్తలు ప్రసారం కావడంతో నెల్లూరు మొత్తం ఈ కేసు గురించే చర్చించుకుంది. బాధిత కుటుంబానికి మద్దతుగా స్థానికులు, బంధువులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పరారీలో ఉన్న శివభార్గవ్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే ఈ కేసును ఓ కొలిక్కి తెస్తామని నెల్లూరు పోలీసులు చెప్పారు.

  English summary
  in a tragic incident, Ramya, a second-year degree student in Nellore city commits suicide while filming selfie video. after depressed with lover, she failed to talk with him. brother of the victim also a fried to accused person. police speed up the investigation
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more