బెదిరించినా మేం జగన్‌తోనే, అందుకే ప్రచారం: నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యేలు
నెల్లూరు: కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు బుధవారం మండిపడ్డారు. అలాగే తాము పార్టీ మారుతామంటూ వచ్చిన వార్తలను కొట్టి పారేశారు.
కృష్ణా నదిలో పడవ ప్రమాదానికి చంద్రబాబు బాధ్యత వహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని బోట్లను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తాను పార్టీ మారుతాననే ప్రచారంపై స్పందిస్తూ.. తమను ఎంత బెదిరించినా వైసీపీని వీడేది లేదన్నారు.

పచ్చ మీడియా తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. టీడీపీ నేత రవిచంద్ర యాదవ్ అవినీతిపై ప్రశ్నించానన్న అక్కసుతో పార్టీ మారుతాననే ప్రచారం చేస్తోందన్నారు.