• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నెల్లూరు కోర్టు సంచలన తీర్పు: సుత్తి సైకోకు ఉరిశిక్ష

By Narsimha
|

నెల్లూరు: సుత్తి సైకో కేసులో నెల్లూరు నాల్గో అదనపు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడు వెంకటేశ్వర్లుకు కోర్టు ఉరిశిక్షను విధించింది.

2016లో హరినాథపురంలో ఆడిటర్ భార్య ప్రభావతి తో పాటు, పూజారి దంపతులను వెంకటేశ్వర్లు సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఆ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో, కోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్షను ఖరారు చేసింది.

సుత్తితో నలుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నెల్లూరు నాలుగవ అదనపు కోర్టు ఉరిశిక్షను విధిస్తూ గురువారం నాడు తీర్పును వెలువరించింది.

అమాయకుడిగా కన్పిస్తూ కిరాతకంగా ప్రాణాలు తీయడమే వెంకటేశ్వర్లు నైజం. నెల్లూరు జిల్లాలో గత ఏడాది వెంకటేశ్వర్లు నలుగురిని అతి కిరాతకంగా చంపేశాడు.నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో కోర్టు ఏడాది లోపుగానే నిందితుడికి శిక్షను విధించడంతో బాధితుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అమాయకంగా కన్పిస్తూ కిరాతకమైన హత్యలు

అమాయకంగా కన్పిస్తూ కిరాతకమైన హత్యలు

చూసేందుకు అమాయకుడిగా ఉంటాడు..చేతిలో ఓ సంచి అందులో సుత్తి, కటింగ్ బ్లేడ్ తో పల్లెటూరు నుంచి ఉపాధి కోసం ఆరాటపడుతున్న వ్యక్తిలా కనిపిస్తాడు...ఇదంతా అతని నరరూప రాక్షసతత్వానికి ఓ వైపు మాత్రమే....మరో వైపు ఆ వస్తువులనే ఆయుధాలుగా చేసుకోని హతమార్చి అందినకాడికి దోచుకెళ్ళే మనతత్వం వెంకటేశ్వర్లుది.

వరుస హత్యలతో పోలీసులకు సవాల్ విసిరాడు

వరుస హత్యలతో పోలీసులకు సవాల్ విసిరాడు

నెల్లూరు జిల్లాలో సైకో కిల్లరు కుక్కపల్లి వెంకటేశ్వర్లు సీరియల్ హత్యలు పోలీసులకు , నెల్లూరు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఒకానొకదశలో ఈ హత్యలు పోలీసులకు సవాల్ విసిరాయి. మారుమూల పల్లె అయిన యర్రబట్లపల్లిలోని రైతు కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు ఆర్ధిక ఇబ్బందులతో హంతకుడిగా మారాడు.కుటుంబ పరిస్థితులతో పాటు విలాసాలకు అలవాటుపడి వెంకటేశ్వర్లు సులభంగా డబ్బులు సంపాదించేందుకు గాను హత్యలకు పాల్పడ్డాడు.

సినిమాలో హంతకులను ఫాలో అయిన వెంకటేశ్వర్లు

సినిమాలో హంతకులను ఫాలో అయిన వెంకటేశ్వర్లు

ఇంటికి పెద్ద కొడుకుగా కుటంబ బారాన్ని మోయాల్సిన వెంకటేశ్వర్లు సులభంగా డబ్బులను సంపాదించేందుకు వరుస హత్యలకు పాల్పడ్డాడు.వ్యవసాయంలో కలిసి రాకపోవడానికి తోడు జూదం, బెట్టింగులతో అప్పుల పాలయ్యాడు. వాటి నుంచి గట్టెక్కెందుకు సులభంగా డబ్బులు సంపాదించుకునే మార్గం కోసం అన్వేషించాడు...ఓ సినిమాలో హంతకుల నేర చరిత్రను, నేరాల తీరును ఈ దుర్మార్గుడు ఆదర్శంగా తీసుకున్నాడు...డబ్బు, నగలు కోసం నేరుగా హత్యలు చేయడం ప్రారంభించాడు. వరుస హత్యలతో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. సినిమాల్లో హంతకులు తప్పులు చేసి ఏ రకంగా తప్పించుకొంటారో వెంకటేశ్వర్లు కూడ అదే ప్లాన్‌ను ఉపయోగించేవాడు.

మహిళలే లక్ష్యంగా

మహిళలే లక్ష్యంగా

2016 జనవరి మాసంలో కావలిలో ఒంటరిగా వెళ్తున్న మహిళపై సుత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలను లాక్కొన్నాడు. అక్కడి నుండి నెల్లూరు సమీపంలోని అల్లీపురంలో పూజారి దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలను దోచుకొన్నాడు. నెల్లూరు పట్టణంలోని నాగేశ్వర్‌రావు ఇంట్లో కేబుల్ ఆపరేటర్ అంటూ ప్రభావతి అనే వివాహితపై దాడిచేసి చంపేశాడు. నాగేశ్వర్‌రావుతో పాటు ఆయన కుటుంబసభ్యులపై కూడ దాడి చేశారు. ఈ సమయంలో స్థానికులు వెంకటేశ్వర్లును బంధించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nellore fourth Addtional court ordered to venkateshwarlu life sentence on Thursday. Venkateswarlu serial murders challenged to police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more