నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దంచికొడుతున్న ఎండలు: నెల్లూరులో అత్యధికంగా 45డిగ్రీల ఉష్ణోగ్రత!

|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన ఉక్కపోతతో జనం ఇబ్బందిపడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినప్పటికీ.. అవి తెలుగు రాష్ట్రాలను తాకడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు. దీంతో మరికొద్ది రోజులు ఈ ఎండల తీవ్రత తప్పేలా లేదు. ఎండల తీవ్రతకు వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణ పవనాలు కూడా కారణమని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

మహారాష్ట్రలోని విదర్భ, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలకు ఉష్ణ గాలులు వీస్తున్నందునా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నెల్లూరులో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడ, అమరావతి, ఒంగోలు, కర్నూలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

nellore records highest maximum temperature in andhrapradesh

గుంటూరు, ఏలూరు, తిరుపతిలో 43, కడపలో 42, రాజమండ్రి, విజయనగరంలో 41డిగ్రీలు, శ్రీకాకుళం, అనంతపురంలో 40, విశాఖలో 38, కాకినాడలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 48గంటల పాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47డిగ్రీలకు చేరాయి.

English summary
Nellore recorded the highest maximum temperature of 45 degree celsius, according to Indian Meteorological Department (IMD).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X