హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువకుడి బ్రెయిన్‌డెడ్: నెల్లూరు-హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో అవయవాలు

|
Google Oneindia TeluguNews

నెల్లూరు/హైదరాబాద్: నెల్లూరు నగరం నవాబుపేటకు చెందిన చిల్లకూరు దినేష్‌రెడ్డి (32) అనే యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన కుటుంబసభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో ఆయన అవయవాలను వివిధ ఆస్పత్రులకు తరలించి అవసరమున్న వారికి అమర్చే ఏర్పాట్లు చేశారు.

 తరలింపు..

తరలింపు..

ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేటకు చెందిన శ్రీహరిరెడ్డి, వసంతలక్ష్మిల కుమారుడు దినేష్‌రెడ్డి. ఆయనకు అక్టోబర్ 13న ఫిడ్స్‌ వచ్చాయి. ఈ క్రమంలో అపోలో ఆస్పత్రిలో మెదడుకు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఇబ్బంది కలగడంతో అక్టోబర్ 19న మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిశారు.

హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు..

హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు..

అయితే దినేష్‌రెడ్డి బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారని అక్కడి వైద్యులు తెలిపారు. మెదడులోని నరాల్లో ఇబ్బంది కలగడంతో అక్టోబర్ 20న నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స చేశారు. అనంతరం దినేష్‌రెడ్డి అచేతన స్థితి(బ్రెయిన్‌డెడ్‌)కి చేరుకున్నారని వైద్యులు నిర్ధరించారు.

గ్రీన్ కారిడార్

గ్రీన్ కారిడార్

ఆ తర్వాత అక్కడ్నుంచి నారాయణ ఆసుపత్రికి తరలించారు. నారాయణ ఆసుపత్రి వైద్యులు పరిశీలించి వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అవయవదానానికి దినేష్ కుటుంబసభ్యులు అంగీకరించినట్లు అవయవదాన్‌ కో ఆర్డినేటర్‌ శాంతి పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు గుండె, ఇతర ఆస్పత్రులకు అవయవాలు

హైదరాబాద్‌కు గుండె, ఇతర ఆస్పత్రులకు అవయవాలు

దినేష్ రెడ్డి అవయవదానానికి తల్లిదండ్రులు అంగీకరించడంతో శనివారం ఉదయం అతని గుండెను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నారాయణ, బొల్లినేని ఆస్పత్రులకు కిడ్నీలను తరలించారు. అతని కళ్లను మోడ్రన్ ఆస్పత్రికి తరలించి అవసరమున్న వారికి అమర్చే ఏర్పాట్లు చేశారు. అవయవాలను ప్రత్యేక ఛానెల్ ద్వారా తరలించారు.

ఆస్పత్రికి..

ఆస్పత్రికి..

నెల్లూరు నుంచి దినేశ్‌ అవయవాలను ఈ ఉదయం హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. వెంటనే వాటిని అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ అంబులెన్స్‌ను బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌కు ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా దాదాపు 10 నిమిషాల్లో పంపారు. దినేశ్‌ కాలేయం, గుండెను ఇతరులకు అమర్చనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

English summary
After a Nellore youth brain dead, his Organs has been donated to others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X