వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోమ్ తగలబడుతుంటే పిడేల్ వాయించిన నీరో పాలన.. జగన్ పాలన ఒకటే : కన్నా

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగుల రాజకీయంపై మండిపడుతున్నారు . వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అని విమర్శలు గుప్పిస్తున్న కన్నా లక్ష్మీ నారాయణ ఇసుక కొరత మీద, ఏపీలో భవనాలకు వైసీపీ రంగుల మీద నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో సమస్యలు పక్కన పెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని అన్నారు.రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించిన చందంగా పాలన ఉందని కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేటి వరకు ఇసుక కొరత తీరలేదని , భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైందని కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.
అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం గోడపై ఉన్న జాతీయ జెండా కనపడకుండా ఆ మూడు రంగులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను వేయించిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . వైసీపీ తీరుపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు.

nero rule and jagans rule is same ... Kanna Lakshminarayana

కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసేందుకే పనికొస్తుందని ఘాటుగా విమర్శించారు. ఒక వైపు ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు వైసీపీ వాళ్ల రంగుల పిచ్చి ఎంతగా పెరిగింది అంటే ఆఖరికి జాతీయ జెండాను అవమానించి దేశ ప్రతిష్టను దెబ్బ తీసే వరకూ వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం చట్ట వ్యతిరేకం' అని ఆయన ట్వీట్ చేశారు. ఇక నిన్నటికి నిన్న భవనాలకు పార్టీ రంగులు వేసుకోవాడానికి తప్ప, రాష్ట్రాన్ని పాలించడానికి వైసీపీ పనికిరాదని ఆయన మండిపడ్డారు. వైసీపీ పాలన, నీరో పాలనలా ఉందని కన్నా ఘాటుగా విమర్శించారు.

English summary
BJP State President Kanna Laxminarayana stressed that the YCP is not worthy of governing the state except for the party colors to the buildings. He stated that ycp rule is equal to nero rule . Workers in the state are suffering with sand shortage but the ruling party didn't care about the problems and they insulted our national flag on a wall in the school permises by coloring for their publicity stunt .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X