వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధు కులం ఏంటి -గుగూల్ సెర్చింగ్ లో టాప్ ప్లేస్ - తేలిందేంటి..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

పీవి సింధు. ఒలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం అందించిన క్రీడాకారిణి. భారత్ నుంచి ఎన్నో కోట్ల మంది ఆశలు..ఆశీస్సులతో ఒలింపిక్స్ లో కాలు పెట్టారు. స్వర్ణం గెలుచు లేక పోయినా.. కోట్లాది మంది మనసులు గెలుచుకున్నారు. అందునా..తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. రియో ఒలింపిక్స్ లో రజిత పతకం గెలవగానే..యావత్ దేశం సింధును ప్రశంసలతో ముంచెత్తింది. ఇప్పడు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచినా..ఇంత కూడా సింధు మీద గౌరవం తగ్గలేదు. ఆటలో ఆమె చూపించిన తెగువ..పోరాట పటిమ అందరూ మెచ్చుకున్నారు.

 సింధు కులం ఏంటంటూ ఆరా..

సింధు కులం ఏంటంటూ ఆరా..

కానీ, ఇదే సమయంలో ఒక ఆసక్తి కర అంశం ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన దేశం కోసం ఆడుతున్న తెలుగు తేజం సింధు రెండు రోజులుగా ట్రెండింగ్ లో ఉన్నారు. గుగూల్-ట్విట్టర్ లో సింధు టాప్ పొజీషల్ లో నిలిచారు. అయితే, ఇక్కడ సింధు విజయాల గురించి తెలుసుకొనే వారి సంఖ్య కంటే...సింధు కులం గురించి తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువగా కనిపించింది. గూగుల్ సెర్చ్ లో ఆమె కులం కోసం వెతికారు. గూగుల్ సెర్చ్ బాక్స్ లో సింధు కోసం శోధించిన వాటిలో ఆమె కులం మోస్ట్ సెర్చెడ్ కీవర్డ్ గా గుర్తించారు.

 తెలుగు రాష్ట్రాల నుంచే సెర్చింగ్..

తెలుగు రాష్ట్రాల నుంచే సెర్చింగ్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సింధు వివరాల కోసం గూగుల్ లో వెతికారు. పీవీ సింధు కాస్ట్ పేరుతో ఎక్కువ మంది శోధించారు. గతంలోనూ పీవీ సింధు రజత పతకం సాధించిన సందర్భంగా ఆమె కాస్ట్ ను గూగుల్ లో సెర్చ చేశారు. పీవీ సింధు, పీవీ సింధు విన్స్, పీవీ సింధు కాస్ట్ వెతికారు. తెలుగు రాష్ట్రాల్లో కుల జాఢ్యం ఎక్కువ. రాజకీయ నేతలు పెంచి పోషిస్తున్న ఈ కులం అనే మత్తు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మన కీర్తిని పెంచుతున్న సింధు లాంటి వారి విషయం లోనూ చడటం పైన జాతీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోతున్నారు.

 జాతీయ స్థాయిలో చర్చకు కారణంగా..

జాతీయ స్థాయిలో చర్చకు కారణంగా..

చిన్న వయస్సులో ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత క్రీడాకారణిగా పీవీ సింధు ఘనత సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం టోక్యోలో సింధు ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకున్నారు. అప్పటి నుంచి కేవలం 24 గంటల్లో సింధు కులం గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య 700 శాతం పెరిగింది. ఇక, సోషల్ మీడియాలోనే ఈ రకమైన చర్చలే ఎక్కువగా కనిపించాయి.

 జాతీయ విశ్లేషకుల విస్మయం..

జాతీయ విశ్లేషకుల విస్మయం..

దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక యువ మహిళా కెరటానికి కులం ఆపాదించటం..ఆమె కులం గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయటం ఎందుకనేది ఇప్పుడు చర్చ. కానీ, కట్టెలు మోసి... ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ లో రజిత పతకం సాధించిన మణిపూర్ కి చెందిన మీరా చాను మాత్రం ఇటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ మహిళ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుంటే.. అటువంటి సింధు ఆట గురించి...సక్సెస్ గురించి పక్కన పెట్టి... ఆమె కులం గురించి ఇంతలా వెతికేస్తున్నారంటే...ఈ పోకడ అంతు చిక్కటం లేదు.

 ఇంతకీ ఏం తెలుసుకున్నారు..

ఇంతకీ ఏం తెలుసుకున్నారు..

గతంలో రియో ఒలింపిక్స్ లో సింధు రజతం గెలిచిన సమయంలోనూ ఇదే తీరు కనిపించింది. కానీ, ఇంతలా లేదు. ఇప్పుడు ఈ స్థాయిలో గుగూల్ లో సెర్చ్ చేసిన అంశం ఈ మధ్య కాలంలో మరొకటి లేదని చెబుతున్నారు. ఇంతకీ ఇంత భారీ స్థాయిలో సెర్చ్ చేసి వారు సింధు గురించి తెలుసుకున్నది ఏమీ లేదు. ప్రోత్సహించి..స్పూర్తిగా తీసుకోవాల్సిన సింధు లాంటి వారి విషయంలో ఈ కులం కోసం సెర్చింగ్ లు ఎందుకో...వెతికి వెతికి అలిసిపోతున్న వారే సమాధానం చెప్పాలి.

English summary
Netizens searching for Sinhdu caste on Google search. Just in one day time above 700 percent searches on this issue were google.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X