గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్‌ను ప్రశంసిస్తూ నోరుజారిన వైసీపీ నేత: మరో ‘ఆణిముత్యం’ అంటూ నెటిజన్ల సెటైర్లు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: తమ అధినేతలను ప్రసన్నం చేసుకునేకుందుకు చాలా మంది నేతలు వారిపై ప్రశంసలు చేయడం సాధారణ విషయమే. ఈ సందర్భంలోనే పలువురు నేతలు పొరబాట్లు చేస్తూ విమర్శలను ఎదుర్కొవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటారు. తాజాగా ఓ వైసీపీ నేత కూడా ఇలాంటి జాబితాలో చేరిపోయారు.

ఆయన మంత్రదండం వల్లే: వైఎస్ జగన్ గెలుపుపై జేసీ సంచలన వ్యాఖ్యలు<br>ఆయన మంత్రదండం వల్లే: వైఎస్ జగన్ గెలుపుపై జేసీ సంచలన వ్యాఖ్యలు

నోరు జారారు..

నోరు జారారు..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ ఏసురత్నం రైతు భరోసా పథకంపై ప్రశంసలు కురిపించారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ పాలనను ప్రశంసిస్తూ ఏదో చెప్పబోయిన ఆయన నోరు జారారు.

స్వర్గీయ.. అంటూ..

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనబోయి స్వర్గీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు ఏసురత్నం. ఇంతలో పక్కనున్న వారు తప్పును సరిదిద్దడంతో.. వెంటనే కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయినా మళ్లీ తడబడ్డారు. స్వర్గీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా భారీగా వర్షాలు పడ్డాయన్నారు.

నెటిజన్ల సెటైర్లు..

కాగా, ఏసురత్నం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేంటి సీఎంను అంతమాటనేశారు అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక టీడీపీకి చెందిన కొందరు కూడా ఈ వీడియోపై సెటైర్లు వేస్తున్నారు. మరో ఆణిముత్యం అంటూ జోకులు వేస్తున్నారు.

వైఎస్సార్ కాలంలోనూ.. జగన్ పాలనలోనూ..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కాలంలో బాగా వర్షాలు పడ్డాయని.. ఇప్పుడు వైఎస్ వైస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనూ వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని ఏసురత్నం చెప్పారు. మధ్యలో కొందరు సీఎంగా ఉన్నప్పుడు వర్షాలు సరిగాపడలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన నోరుజారి నెటిజన్లకు దొరికిపోయారు. అసలు స్వర్గీయ అంటే అర్థం తెలుసా సారు..అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

English summary
Netizens trolls YSRCP leader Yesuratnam for tongue slip on CM YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X