వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కాన్వాయ్‌లోకి కొత్త బుల్లెట్ ప్రూఫ్, బాబుకు చైనా ప్రశంసలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాన్వాయ్‌లోకి కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం చేరనుంది. ఈ సరికొత్త ఆధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎస్కార్ట్ వాహనాలకు ముందుగా వెళ్లనుంది. ఇందులో ఎలాంటి వాహన దాడులనైనా తిప్పికొట్టగల వ్యవస్థ ఉంటుంది. ఎలాంటి దాడులనైనా తిప్పుకొట్టగల ఆరుగురు పోలీసులు ఉంటారు. డీజీపీ అనురాగ్ శర్మ సోమవారం నాడు సచివాలయంలో ఈ వాహనాన్ని పరిశీలించారు.

చంద్రబాబుకు చైనా ఉప ప్రధాని ప్రశంసలు

చైనా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చైనా ఉప ప్రధాని ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు సంస్కరణలు తమకు ఎంతగానో నచ్చాయని చైనా ఉప ప్రధాని వాంగ్ యాంగ్ అన్నారు. చంద్రబాబు పర్యటనతో ఏపీ పైనే కాక భారత్ పట్ల కూడా తమకు మరింత అవగాహన వచ్చిందన్నారు.

 New bullet proof vehicle into KCR convoy

చైనాలో చంద్రబాబు బిజీబిజీ

చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. సోమవారం ఉదయం ఎలక్ర్టానిక్‌ హార్డ్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో బాబు సమావేశమయ్యారు. భారత్, చైనాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందుతున్నాయన్నారు.

భారత్‌కు ఏటా 200 నుంచి 300 కోట్ల బిలియన్‌ డాలర్ల హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందన్నారు. హార్డ్‌వేర్‌ తయారీ పరిశ్రమలు నెలకొల్పే విధంగా భారత్‌లోనే అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు.

హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను తాము దిగుమతి చేసుకుంటున్నామని, దీనికి స్వస్తి పలికే విధంగా భారత్‌లోనే ఈ తయారీ పరిశ్రమలు నెలకొల్పే విధంగా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో షియామీ, ఫాక్స్‌కాన్‌ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ సహజంగా పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలున్న రాష్ట్రంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో నీరు, విద్యుత్‌ కొరత లేదని, పరిశ్రమలు నెలకొల్పేందుకు 21 రోజుల్లో అనుమతులిచ్చే పారదర్శక విధానం అమలు చేస్తున్నామని చైనా సంస్థల ప్రతినిధులకు వివరించారు. ఐటి రంగంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ముందుకు రావాలన్నారు.

English summary
New bullet proof vehicle into Telangana CM KCR convoy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X