వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ఎఫెక్ట్ : ఏపికి కొత్త డిజిపి..! : ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు ..!

|
Google Oneindia TeluguNews

ఏపికి కొత్త డిజిపి రానున్నారా. ఎన్నిక‌ల షెడ్యూల్ రాగానే డిజిపిని మార్చాల‌ని ఎన్నిక‌ల సంఘం దృష్టి పెట్టిన‌ట్లు విశ్వ స నీయ స‌మాచారం. ఇప్ప‌టికే ఏపి లో డిజిపి పై విప‌క్ష నేత జ‌గ‌న్ నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసారు . దీని పై ఎన్నిక‌ల సంఘం ఇప్పుడున్న డిజిపిని మారిస్తే ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వాల‌నే దాని పై దృష్టి సారించింది.

డిజిపి పై జ‌గ‌న్ ఫిర్యాదు

డిజిపి పై జ‌గ‌న్ ఫిర్యాదు

గ‌త నెల‌లో కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ని క‌లిసిన వైసిపి అధినేత జ‌గ‌న్ డిజిపి పై ఫిర్యాదు చేసారు. ఏపి ప్రస్తుత డిజిపి ఠాకూర్ టిడిపి ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి తెచ్చారు. త‌న పై హ‌త్యా య‌త్నం జ‌రిగిన స‌మ‌యంలోనూ డిజిపి ఏక ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని..ఆయ‌న అధికార పార్టీ నేత‌ల‌కు మ‌ద్ద‌తు గా ఉన్నార‌ని జ‌గ‌న్ ఫిర్యాదు చేసారు. అదే విధంగా..ఏపి నిఘా విభాగం బాస్ ఏబి వెంకటేశ్వ‌ర రావు పైనా.. కో ఆర్డినేష న్ అధికారి ఘ‌ట్ట‌మ‌నేని శ్రీనివాస్ ను విధుల నుండి దూరంగా పెట్టాల‌ని జ‌గ‌న్ ఎన్నిక‌ల సంఘాన్ని అభ్య‌ర్దించారు. దీ ని లో భాగంగా..ఠాకూర్ ను ఎన్నిక‌ల విధుల నుండి ప‌క్క‌న పెడితే ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వాల‌నే దాని పై ఎన్నిక‌ల సంఘం క‌స‌రత్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

గ‌తంలో రామ‌వ‌తార్ యాద‌వ్ సైతం..

గ‌తంలో రామ‌వ‌తార్ యాద‌వ్ సైతం..

2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్పుడు ఏపి డిజిపి గా ఉన్న రామ‌వ‌తార్ యాద‌వ్ విష‌యంలోనూ ఎన్నిక‌ల సంఘం ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించింది. అప్పుడు ఎన్నిక‌ల్లో యాద‌వ్ నాటి వైయ‌స్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నాటి ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసారు. దీంతో..నాడు ఎన్నిక‌ల సంఘం డిజిపిగా ఎన్న యాద‌వ్ ను ప‌క్క‌న పెట్టి.. ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌రకు సీనియ‌ర్ అధికారి మ‌హంతికి డిజిపిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. 2009 ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత తిరిగి అధికారంలోకి వ‌చ్చిన వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే తిరిగి యాద‌వ్ ను డిజిపిగా నియ‌మించారు.

ఠాకూర్ స్థానంలో స‌వాంగ్ కు అవ‌కాశం..

ఠాకూర్ స్థానంలో స‌వాంగ్ కు అవ‌కాశం..

ఇక‌, ఠాకూర్ ను ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు విధుల నుండి ప‌క్క‌న పెట్టాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆలోచ‌న చేస్తున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం. అదే జ‌రిగితే ఠాకూర్ స్థానంలో గ‌తంలో విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ గా ప‌ని చేసి..ప్ర‌స్తుతం విజిలె న్స్ డిజిగా ఉన్న గౌతం స‌వాంగ్ కు అవ‌కాశం ఇచ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. డిజిపి గా ఠాకూర్ నియామ‌క స‌మ‌యంలోనూ ఠాకూర్ పేరు చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే ముఖ్య‌మంత్రి అప్పుడు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు. ఇక‌, ఎన్నిక‌ల షెడ్యూ ల్ విడుద‌ల కాగానే..ఠాకూర్ ను త‌ప్పించి గౌతం స‌వాంగ్ కు అవ‌కాశం ఇస్తార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగు తోంది. ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఆయ‌న‌కు ఇన్‌ఛార్జ్ డిజిపిగా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది.

English summary
Elections commission concentrated on appoint new DGP for Ap for elections. YCP chief Jagan complaint on present DGP Thakur that he is supporting TDP leaders and favouring to Govt. Reliable source said Election commission working on appoint Swang as incharge DGP for Ap in place of Thakur up to completion of elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X