వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్త చర్చ .. తెరమీదకు 25 జిల్లాలు.. మూడు రాజధానులు కూడా అందుకేనట !!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Vijayasai Reddy Sensational Comments On Jagan's Historic Decision About AP Capital ! || Oneindia

ఒకపక్క ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మరోపక్క నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు. ఇదే సమయంలో మరో కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి.

 మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు

భవిష్యత్తులో ఏపీని 25 జిల్లాలుగా చేస్తామని విజయసాయి వ్యాఖ్యలు

భవిష్యత్తులో ఏపీని 25 జిల్లాలుగా చేస్తామని విజయసాయి వ్యాఖ్యలు

ఇకనుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు కాదు 25 జిల్లాలు అని ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏపీని 25 జిల్లాలుగా చేస్తామని పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగానే అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అధికారం కోసం ఆశపడకుండా ప్రజలకు సేవ చేయడానికి నిత్యం పరితపించే వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌ అంటూ ఎంపీ విజయసాయి జగన్ కు కితాబిచ్చారు.

జగన్ ప్రకటన చరిత్రలో నిలిచిపోతుందన్న విజయసాయిరెడ్డి

జగన్ ప్రకటన చరిత్రలో నిలిచిపోతుందన్న విజయసాయిరెడ్డి

విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తూ జగన్ ఇచ్చినటువంటి ప్రకటన చరిత్రలో నిలిచిపోతుందని విజయసాయి వ్యాఖ్యానించారు. అధికారమంతా ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైతే అది రాష్ట్రానికి మంచిది కాదన్న ఉద్ధేశ్యంతోనే జగన్ అధికార వికేంద్రీకరణ చెయ్యాలని భావిస్తున్నట్లుగా విజయసాయి పేర్కొన్నారు. అందుకోసం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను రాబోయే కాలంలో 25 జిల్లాలుగా చేస్తామని చెప్పారు. ఆ 25 జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నారు. ఇక ఈ కారణంగానే జగన్‌ మూడు ప్రాంతాలను రాజధానులుగా మార్చాలని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.

జగన్ జన్మదిన వేడుకల్లో విజయసాయి ఆసక్తికర ప్రకటన

జగన్ జన్మదిన వేడుకల్లో విజయసాయి ఆసక్తికర ప్రకటన

నేడు విశాఖలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాసరావు సహా పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కేక్‌ కట్ చేసి, సీఎం వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని , విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడంచారిత్రక నిర్ణయమని విజయసాయి రెడ్డి కొనియాడారు.

ఎన్నికలకు ముందే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని జగన్ హామీ

ఎన్నికలకు ముందే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని జగన్ హామీ


ఏపీలో తాను అధికారంలోకి వస్తే, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు . ఇక ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకున్న జగన్ హామీ నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు ఎప్పటి నుండో కసరత్తులు చేస్తున్నారు. ఇక తాజాగా మూడు రాజధానుల ప్రకటన కూడా 25 జిల్లాల ఏర్పాటు కోసమే అని చెప్పటం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పటికే ఉన్న 13 జిల్లాలతో పాటు కొత్తగా రానున్న 12 జిల్లాలు.. మొత్తం 25 జిల్లాలతో ఏపీ

ఇప్పటికే ఉన్న 13 జిల్లాలతో పాటు కొత్తగా రానున్న 12 జిల్లాలు.. మొత్తం 25 జిల్లాలతో ఏపీ

ఇక ఇప్పటికే ఉన్న 13 జిల్లాలతో పాటు కొత్తగా రానున్న 12 జిల్లాలు చూస్తే అనకాపల్లి (విశాఖ జిల్లా), అరకు (విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), నరసాపురం (పశ్చిమగోదావరి), విజయవాడ (కృష్ణా జిల్లా), నర్సరావుపేట (గుంటూరు జిల్లా), బాపట్ల (గుంటూరు జిల్లా), తిరుపతి (చిత్తూరు జిల్లా), రాజంపేట (కడప జిల్లా),నంద్యాల (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా) అని తెలుస్తుంది. అంతే కాదు అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్టు చర్చ జరిగింది. ఇప్పుడు మరోమారు అది తెరమీదకు వచ్చింది.

English summary
Vijayasai Reddy said it was a historic decision to make Visakhapatnam the administrative capital. CM said he was thinking of setting up 25 districts due to this jagan thinking about three capitals formula in AP. The AP government is making many decisions aimed at developing the state and this is also one of the initiative step of Jagan .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X