వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్త జిల్లాలపై కిరికిరి.. తలోమాట.. వైసీపీ నేత పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు..

|
Google Oneindia TeluguNews

విభజన జరిగన ఆరేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ఖరారైంది. ఇప్పుడున్న 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలుగా విభజించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది. కొత్త జిల్లాలు ఎలా ఉండాలనేదానిపై ప్రధాన కార్యదర్శి నీల సాహ్ని నేతృత్వంలో, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్ గా, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీసెస్), ప్లానింగ్ విభాగాల కార్యదర్శులు, సీఎంవో ప్రతినిధులు సభ్యులుగా ఉండే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. కమిటీ తన పని ప్రారంభించకముందే రాజకీయ నేతల నుంచి అనేక డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో కరోనా: ఒక్కరోజే 40 మంది బలి.. భారీగా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో డేంజర్ బెల్స్ఏపీలో కరోనా: ఒక్కరోజే 40 మంది బలి.. భారీగా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో డేంజర్ బెల్స్

పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుండగా, అధికార వైసీపీ నేతలే ఆ విధానాన్ని తప్పు పడుతున్నారు. ధర్మాన ప్రసాద్ లాంటి సీనియర్ నేతలూ దీనిపై బాహాటంగా స్పందించారు. పార్లమెంట్ నియోజకవర్గాలను బేస్ చేసుకుని జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవని అన్ని పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా,

 new districts in andhra pradesh: including ysrcps pvp, several leaders demands on districts

కేబినెట్ భేటీలో కొత్త జిల్లాల అంశంపై జరిగిన చర్చలో మాత్రం సీఎం జగన్ భిన్నంగా స్పందించారని, పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్ గా పెట్టుకుని జిల్లాలు విభజించే కంటే... పరిపాలన సౌలభ్యం కోసం అసెంబ్లీ సెగ్మెంట్లనే ప్రాతిపదికగా తీసుకుందామని ఆయన స్పష్టంచేసినట్లు తెలిసింది. కనీసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడితే అందరికీ సౌకర్యంగా ఉంటుదన్నది ఆయన భావనగా తెలుస్తోంది. సీఎస్ నేతృత్వంలోని కమిటీ కూడా సీఎం సూచనకు అనుగుణంగానే పనిచేయబోతుండటం సుస్పష్టం. ఇదిలా ఉంటే,

అనూహ్యం: జగన్ బాటలో మోదీ ఇలాకా.. ప్రధాని భార్యను తిట్టిన నోటితో ఇలా.. సాయిరెడ్డి శైలిలో..అనూహ్యం: జగన్ బాటలో మోదీ ఇలాకా.. ప్రధాని భార్యను తిట్టిన నోటితో ఇలా.. సాయిరెడ్డి శైలిలో..

కొత్త జిల్లాలపై కమిటీ పని మదలుకాకముందే వివిధ పార్టీల నేతలు ఆయా జిల్లాలకు పెట్టాల్సిన పేర్లపై కామెంట్లు చేస్తున్నారు. ''కొత్త జిల్లాల ఏర్పాటులో, కృష్ణా జిల్లా వాసులకు కానుకగా, ఒక జిల్లాకు "ఎన్టీఆర్ జిల్లా" గా నామకరణం చేయవలసినదిగా అందరి తరఫునా సీఎం జగన్ కు విజ్ఞప్తి'' అంటూ వైసీపీ కీలక నేత, సినీ నిర్మా పీవీపీ వ్యాఖ్యానించారు. గతంలో.. పాదయాత్రలో భాగంగా నిమ్మకూరును సందర్శించిన సందర్భంలో జగన్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల్లో ఒకదానికి మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు పేరును పెడతామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కొత్త జిల్లాలు మనుగడలోకి వచ్చేనాటికి ఇంకా ఎన్ని డిమాండ్లు తెరపైకి వస్తాయో చూడాలి.

English summary
andhra pradesh Cabinet has set the committee for new districts in the state. now several leaders including ysrcp pvp raising their demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X