వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్త జిల్లాలు: ఆ మెలికకు అర్థమేంటి? - మూడు నెలల డెడ్ లైన్ తో కమిటీ - నీలం వెళ్లేలోపే..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు లేదా జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ముందడుగు పడింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా జులై 15నాటి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు.. తాజాగా దానికి సంబంధించి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో జిల్లాల సంఖ్యను కూడా పేర్కొనడం సరికొత్త చర్చకు దారితీసింది.

కమిటీలో ఎవరెవరంటే..

కమిటీలో ఎవరెవరంటే..


కొత్త జిల్లాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికే మొత్తం ఆరుగురితో కమిటీ వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారని, సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ సభ్యలుగా కొనసాగుతారని తెలిపింది. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఉండనున్నారు.

సీఎం జగన్, సోము వీర్రాజుపై రఘురామ ఫైర్ - వేట కుక్కల్లా తరుముతారు - 13 రాజధానులకు అర్థముందా?సీఎం జగన్, సోము వీర్రాజుపై రఘురామ ఫైర్ - వేట కుక్కల్లా తరుముతారు - 13 రాజధానులకు అర్థముందా?

మూడు నెలల డెడ్ లైన్..

మూడు నెలల డెడ్ లైన్..

రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, ప్రజలకు ప్రభుత్వ సేవల్ని మరింత దగ్గర చేసే క్రమంలో ఇదివరకే గ్రామ, వార్డు సచివాలయాల్ని, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామన్న ప్రభుత్వం.. ఇప్పుడు జిల్లా స్థాయిలోనూ మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నదని, అందులో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ వేశామని తెలిపింది. సీఎస్ నీలం సాహ్ని నేతృత్వంలో ఏర్పాటైన ‘‘జిల్లాల పునర్విభజన అధ్యయన కమిటీ'' మూడు నెలల్లోగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం ఇప్పటికే ఒక దఫా పొడిగించగా, మరో మారు ఉత్తర్వులివ్వాలంటూ కేంద్రానికి జగన్ సర్కారు లేఖ రాసింది. ఆమె రిటైర్ అయ్యేలోపే కొత్త జిల్లాల ప్రక్రియను పూర్తి చేయించాలని సర్కారు భావిస్తున్నట్లుంది.

జైలులోనూ జగన్ వేధింపులు, అన్నం పెట్టకుండా ఒత్తిళ్లు - జేసీ సంచలనం - మెడకు మరో మూడు కేసులు..జైలులోనూ జగన్ వేధింపులు, అన్నం పెట్టకుండా ఒత్తిళ్లు - జేసీ సంచలనం - మెడకు మరో మూడు కేసులు..

కమిటీ ఏం చేస్తుందంటే..

కమిటీ ఏం చేస్తుందంటే..

కేంద్ర ప్రభుత్వం పలు స్కీములను జిల్లాల ప్రతిపాపదికన అమలు చేస్తున్నప్పటికీ.. దేశంలో జిల్లాల ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలేవీ రూపొందించలేదు. దీంతో వివిధ రాష్ట్రాలు ఒక్కో తీరుగా జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాయి. విభజన తర్వాత తెలంగాణలోని 10 జిల్లాల్లో కలిపి ఉన్నవి 17 లోక్ సభ నియోజకవర్గాలే అయినా, కొత్తగా 33 జిల్లాలను పునర్ వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అరకు లాంటి కొన్ని లోక్ సభ స్థానాలు ఏకంగా నాలుగేసి జిల్లాల్లో విస్తరించిఉన్న దరిమిలా సీఎస్ కమిటీకి విభిన్న సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, వాటి సరిహద్దుల నిర్ధారణతోపాటు వనరులు, ఉపాధి అవకాశాల సమతూకం, జిల్లా కేంద్రానికి చిట్టచివరి గ్రామానికి మధ్య దూరం తదితర అంశాలను సైతం కమిటీ అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Kerala Rains, Landslide : మళ్ళీ కేరళ అతలాకుతలం | కుండపోత వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు...!!
26 లేదా 27 జిల్లాలకు అవకాశం లేదా?

26 లేదా 27 జిల్లాలకు అవకాశం లేదా?


ఏపీలో కొత్త జిల్లాలపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం.. జిల్లాల సంఖ్యను 25గా పేర్కొంటూ మెలిక పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జులై 15నాటి కేబినెట్ భేటీలో.. పార్లమెంటు స్థానాల ప్రాతిపదికన జిల్లాల్ని పునర్ వ్యవస్థీకరిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయాన్ని కొందరు మంత్రులు వెలిబుచ్చారు. ఇబ్బందులు ఉన్న చోట.. లోక్ సభ స్థానాన్ని కాకుండా అసెంబ్లీ సెగ్మెంట్లు, లేదా మండలాల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకొని కొత్త జిల్లాలు రూపకల్పన చేయాలని సీఎం జగన్ చెప్పినట్లు వెల్లడైంది. ఆ లెక్కన మొత్తం జిల్లాల సంఖ్య 26 లేదా 27కు పెరగొచ్చని, అవకాశం, అవసరాన్ని బట్టి ఆ సంఖ్య 28కి చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదని రిపోర్టులు వచ్చాయి. కానీ శుక్రవారం నాటి ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా ‘‘25 జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ''అని పేర్కొనడం గమనార్హం.

English summary
andhra pradesh govt on friday passes an order for Establishment of a committee to study the redistricting in the state. chief secretary neelam sahni will lead the six member committee and govt has put three month deadline to complete the study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X