వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పన్ను ఎగవేతలకు చెక్ - ఆర్దికశాఖలో కొత్త విభాగం- వారి ఆటలు సాగవిక....

|
Google Oneindia TeluguNews

విభజన తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది. అసలే కొత్తగా ఆదాయం పుట్టక, ఉన్న ఆదాయం కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతుండగా... పన్ను ఎగవేతలు కూడా బాగా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. వీటి ప్రకారం తాజాగా కేంద్రం తరహాలోనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్ధిక శాఖ పరిధిలోనే పనిచేసే ఈ విభాగానికి రాష్ట్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ డైరెక్టరేట్ గా నామకరణం చేశారు. రాష్ట్రంలో జీఎస్టీ, వ్యాట్ తో పాటు, ఇతర పన్ను ఎగవేతలపై ఈ విభాగం దృష్టిసారించబోతోంది. పన్ను ఎగవేతలను అరికట్టడం, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచేలా ఈ డైరెక్టరేట్ పనిచేయబోతోంది.

new dri wing established in ap finance department to curb evation of taxes

జూలై 1 నుంచి ఏర్పాటయ్యే ఈ ఎస్డీఆర్ఐ విభాగంలో ముందుగా మూడు కొత్త పోస్టులను కేటాయించారు. ఇందులో కమిషనర్ లేదా స్పెషల్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ హోదాల్లో ముగ్గురు అధికారులు విధులు నిర్వర్తించనున్నా్రు.
వీటిలో కమిషనర్ పోస్టును కొత్తగా భర్తీ చేయనుండగా.. మిగతా రెండు పోస్టులను వాణిజ్య పన్నుల శాఖ నుంచి డిప్యూటేషన్ పై తీసుకోనున్నారు.

English summary
andhra pradesh government on monday issued orders to create a new head of the department by name Andhra pradesh State directorate of Revenue Intelligence (APSDRI). in wake of increasing evasion of taxes govt has eatablished the new h.o.d.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X