విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని వాసులకు శుభవార్త:గుంటూరు-విజయవాడ మధ్య డైలీ ఎక్స్‌ప్రెస్‌

|
Google Oneindia TeluguNews

అమరావతి:గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రాంత వాసుల ఆకాంక్ష నెరవేరింది. గుంటూరు-విజయవాడ నగరాల మధ్య విస్తృతంగా జరిగే రాకపోకల దృష్ట్యా రెండు జిల్లాల ప్రజలు ఈ రెండు నగరాల మధ్య ప్రత్యేక రైలు ఉంటే బాగుండని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

అందులో నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఈ రెండు జిల్లాల మధ్య రాకపోకలు మరింత పెరగడం...పైగా ఈ ప్రాంతం రాజధాని పరిధిలోకి రావడంతో గుంటూరు-విజయవాడ నగరాల మధ్య నూతన రైలు అనివార్యమైంది. ఎట్టకేలకు పరిస్థితి అర్థం చేసుకున్న రైల్వే శాఖ ఈ రెండు నగరాల మధ్య కొత్త రైలు...అదీ డైలీ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాంతవాసుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

New Express train between Vijayawada-Guntur launched

రాజధాని ప్రాంత ప్రయాణికుల కోరిక మేరకు గుంటూరు-విజయవాడ నగరాల మధ్య గుంటూరు-విజయవాడ-గుంటూరు ఇలా షటిల్ సర్వీసు తిరిగే విధంగా ఒక డైలీ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నట్లు సీనియర్‌ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్‌ 07237 విజయవాడ -గుంటూరు డైలీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతి రోజూ తెల్లవారుఝామున 4.25 గంటలకు విజయవాడలో బయలుదేరి 5.10 గంటలకు మంగళగిరి, 6.25కి గుంటూరు చేరుకొంటుంది. అలానే నెంబర్‌ 07238 గుంటూరు-విజయవాడ డైలీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రాత్రి 10.15 గంటలకు గుంటూరులో బయలుదేరి 10.45కి మంగళగిరి, 11.15కు విజయవాడకు చేరు కొంటుంది.

ఈ రైలులో నాలుగు స్లీపర్‌క్లాస్‌, 12 సెకండ్‌ క్లాస్‌, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ బోగీలు ఉంటాయని సీనియర్‌ డీసీఎం తెలిపారు. ఇప్పటిదాకా ఇదే రైలు రోజూ విజయవాడ -రాయగడ మధ్యన నడుస్తోంది. అయితే కొన్ని నెలలుగా దీనిని గుంటూరుకు తీసుకొచ్చి పిట్‌లైన్‌లో క్లీనింగ్‌ చేసి మళ్లీ విజయవాడకు తీసుకెళుతున్నారు. దీనివల్ల రైల్వేకు ఇంధనం/విద్యుత్‌ రూపంలో ఖర్చు అవుతోండటంతో ప్రస్తుతానికి విజయవాడ-గుంటూరు-విజయవాడ మధ్యన ఎక్స్‌ప్రెస్‌ రైలుగా నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. గుంటూరు నుంచి బయలుదేరే రైలు విజయవాడకు చేరుకొన్న తర్వాత నెంబర్‌ని 17243గా మార్పుచేసి రాత్రి 11.30 గంటలకు రాయగడకు పంపిస్తారు.

దీనివల్ల రాత్రి వేళ రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, విజయనగరం, ఒడిశాలోని రాయగడ వెళ్లదలచిన వారికి ఈ కొత్త రైలు ద్వారా మరో రవాణా అవకాశం అందుబాటులోకి రానుంది. ఇదేవిధంగా నెంబర్‌ 17244 రాయగడ నుంచి విజయవాడకు వచ్చిన తర్వాత నెంబర్‌ని మార్చి గుంటూరు వరకు నడుపుతారు. మొత్తం మీద గుంటూరు జిల్లా వాసులకు కొత్తగా ఈ రాయగడ ఎక్స్‌ప్రెస్‌ రైలు సౌకర్యం అందుబాటులోకి రావడం ఆనందం కలిగిస్తోందని చెప్పుకోవచ్చు.

English summary
Amaravathi: A new daily express train between Vijayawada and Guntur will be launched very soon, mainly to facilitate travel of Andhra Pradesh new capital region passengers from these two districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X