వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించిన విజయశాంతి: ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హైదరాబాద్ దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.

అభినందిస్తున్నా..

అభినందిస్తున్నా..

వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అమానుష దాడితో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్న సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నాను' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

జగన్ ప్రకటనపై విజయశాంతి హర్షం..

జగన్ ప్రకటనపై విజయశాంతి హర్షం..


అంతేగాక, ‘ఈ కొత్త చట్టం గురించి అసెంబ్లీ జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మహిళలపై అసభ్య సందేశాలు పంపేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షనీయం. మహిళల భద్రత కోసం ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను' అని విజయశాంతి ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా, మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్షపడేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఉందని, ఇందు కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

కొత్త చట్టాలు అవసరమంటూ జగన్..

కొత్త చట్టాలు అవసరమంటూ జగన్..

మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. చిన్న పిల్లలపై జరుగుతున్న దారుణాలు, హైదరాబాద్ దిశ ఉదంతం తన మనసును ఎంతో కలిచివేసిందని జగన్ అన్నారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇలాంటి దారుణాలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మూడు వారాల్లోనే శిక్షల అమలు..

మూడు వారాల్లోనే శిక్షల అమలు..

రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలని అన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం మూడు వారాల్లోనే శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో సోమవారం స్పష్టం చేశారు. దిశ ఘటన ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు జగన్. తెలంగాణ పోలీసులను కూడా అభినందించారు.

English summary
new law for punish rapists: vijayashanthi praise ap cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X