విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ ఆఫీసులపై దాడుల వెనుక గంజాయి రచ్చ-సర్కార్ హ్యాండ్సప్-జగన్ సర్కార్ వ్యూహం అదేనా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడులకు కారణమైన గంజాయి సాగు, అక్రమ రవాణా విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ధోరణే తాజా పరిస్దితిని నిదర్శనంగా నిలుస్తోంది. కళ్లముందే కోట్లాది రూపాయల గంజాయి సాగు జరుగుతున్నా, అక్రమ రవాణా అయిపోతున్నా, ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి తనిఖీలు చేస్తున్నా ఏపీ పోలీసులు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారు. దీని వెనుక రాజకీయ నేతల హస్తం ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇది కాస్తా చినికి చినికి గాలి వానగా మారి టీడీపీ నేతల విమర్శలు, పోలీసుల నోటీసులు, టీడీపీ ఆఫీసులపై దాడులకూ దారి తీసింది.

 ఏపీలో గంజాయి చిచ్చు

ఏపీలో గంజాయి చిచ్చు

ఏపీలో గంజాయి చిచ్చు రేపుతోంది. విశాఖ మన్యంలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతోంది. కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపడంలో పోలీసులు విఫలమవుతున్నారు. దీంతో ఇది అంతిమంగా రాజకీయ రచ్చకు కారణమవుతోంది. గంజాయి సాగుపై విపక్షాలు విమర్శలు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారికే నోటీసులు ఇచ్చి విచారణలు చేయడంతో ఈ వ్యవహారం ముదిరింది. అసహనంతో టీడీపీ నేతలు చేసిన విమర్శలు ఇప్పుడు వైసీపీలో మంటపుట్టించాయి. చివరికి టీడీపీ ఆఫీసులపై దాడుల వరకూ ఈ వ్యపహారం వెళ్లింది.

గంజాయిపై పోలీసుల హ్యాండ్సప్

గంజాయిపై పోలీసుల హ్యాండ్సప్

విశాఖ మన్యంలో భారీ ఎత్తున గంజాయి అక్రమంగా సాగు చేస్తున్నా, భారీ ఎత్తున రవాణా చేస్తున్నా పోలీసులు మాత్రం నియంత్రించలేకపోతున్నారు. రాష్ట్రంలో లెక్కకు మిక్కిలిగా దర్యాప్తు విభాగాలు ఉన్నా గంజాయి అక్రమ సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపడంలో విఫలమవుతున్నాయి. దీంతో రోజురోజుకూ గంజాయి భూతం పెరుగుతూనే ఉంది. పోలీసులు చూసీ చూడనట్లుగా వదిలేస్తుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రాజకీయ కారణాలతో పోలీసులు మౌనంగా ఉండిపోతుండటంతో గంజాయి అక్రమార్కులు విచ్చలవిడిగా సాగు, రవాణా చేపడుతున్నారు.

విమర్శలకు తావిచ్చిన సర్కార్

విమర్శలకు తావిచ్చిన సర్కార్

ఓవైపు విశాఖ మన్యం నుంచి భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా సాగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం రాజకీయంగా ఎదురుదాడి చేయడానికే పరిమితం అవుతోంది. గంజాయి సాగు, అక్రమ రవాణాపై నిఘా నివేదికలు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. విపక్షాల విమర్శలపై స్పందించి ఉక్కుపాదం మోపి ఉంటే పరిస్ధితి ఇంతవరకూ వచ్చేది కాదనే వాదన వినిపిస్తోంది. సర్కార్ మాత్రం అలా చేయకుండా వాటిని రాజకీయంగా ఎదుర్కోవడానికే మొగ్గు చూపడంతో విమర్శలు మరింత పెరుగుతూ వచ్చాయి. అదే సమయంలో గంజాయిపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణల పేరుతో వారిని వేధించడంతో ఈ విమర్శలు మరింత పెరిగాయి.

దాడుల పర్వంతో పొలిటికల్ వార్

దాడుల పర్వంతో పొలిటికల్ వార్


టీడీపీ, వైసీపీ మధ్య గంజాయి సాగు, అక్రమ రవాణాకు సంబంధించి కొన్ని రోజులుగా మాటల యుద్ధం సాగుతోంది. దీనికి తోడు పోలీసులు టీడీపీ నేతల్ని విచారణల పేరుతో వేధిస్తుండంతో అసహనానికి గురైన టీడీపీ నేత పట్టాభి తీవ్ర విమర్శలకు దిగారు. దీంతో పట్టాభి విమర్శల్ని తట్టుకోలేని వైసీపీ శ్రేణలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగారు. దీంతో పొలిటికల్ వార్ మరింత ముదిరింది. తమ పార్టీ ఆఫీసులపై దాడులకు నిరసనగా టీడీపీ ఇవాళ రాష్ట్ర బంద్ నిర్వహిస్తుండగా.. దీనికి కౌంటర్ గా వైసీపీ కూడా నిరసనలు చేపడుతోంది. దీంతో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది.

జగన్ సర్కార్ వ్యూహమిదేనా ?

జగన్ సర్కార్ వ్యూహమిదేనా ?


రాష్ట్రంలో ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు కావస్తోంది. ఎలాగో మరో రెండున్నరేళ్ల సమయం ఉండనే ఉంది. కానీ ఇప్పుడే ఎన్నికలు వస్తున్నాయనే విధంగా రాజకీయ వాతావరణం మారిపోతోంది. గంజాయి సాగుపై టీడీపీ విమర్శల్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని చర్యలు చేపడితే సరిపోయే దానికి టీడీపీ ఆఫీసులపై దాడుల వరకూ వెళ్లడంతో ఇప్పుడు రాజకీయ రచ్చ ముదిరింది. దీంతో వైసీపీ ఎన్నికల వేడి రగిల్చినట్లయింది. వచ్చే మార్చి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేసిన జగన్.. ఇప్పుడు టీడీపీపై వైసీపీ శ్రేణులు దాడుల వరకూ వెళ్లడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది. ఇప్పటి నుంచే టీడీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే వైసీపీ ఇలా దాడులకు దిగిందా అన్న చర్చ సాగుతోంది.

English summary
after ysrcp government's failure to control Cannabis cultivation and transport in visakhapatnam agency causes political war between ysrcp and tdp in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X