రేవంత్‌కు కొత్త చిక్కు?: ఎదురుపడ్డ స్టీఫెన్, ఏసీబీ కోర్టు వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇవ్వచూపిన కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి మరో చిక్కులో పడ్డారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షల డబ్బు కట్టలు ఇచ్చారు. వాటి పైన బ్యాంక్ సీల్ లేదనే విషయం తెలిసిందే.
ఆ సీల్‌ను తొలగించి ఉంటారని భావిస్తున్నారు. అలాకాకపోయినా అధి నల్లధనంగా కూడా కావొచ్చునని ప్రాథమికంగా అధికారులు అనుమానిస్తున్నారు. డబ్బును బ్యాంకు నుండి డ్రా చేసినట్లయితే, తప్పనిసరిగా బ్యాంకు సీల్ ఉంటుంది.

అలా లేకుండా చేత్తో కట్టలు కట్టినట్లుగా ఉందని తెలుస్తోంది. దీంతో ఆ డబ్బును ఎక్కడి నుండి తెచ్చారనే విషయంపై రేవంత్ రెడ్డి చెప్పవలసి ఉంది. రేవంత్ రెడ్డి చెప్పకుంటే ఈడి ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగవచ్చునని అంటున్నారు.
రేవంత్, స్టీఫెన్ ఎవరికివారే
అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ ఎదురుపడ్డారు. వారు ఒకరికి మరొకరు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. స్టీఫెన్‌కు ముడుపులు ఇస్తున్నారనే ఆరోపణల పైన రేవంత్ రెడ్డిని ఏసీబీ ఆదివారం సాయంత్రం అరెస్టు చేసిన విషయ తెలిసిందే.
ఏసీబీ కోర్టు వద్ద ఉద్రిక్తత
ఏసీబీ కోర్టు వద్ద సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, తెలంగాణ ఐకాస ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. దీంతో కోర్టు వద్ద ఉద్రిక్తత కనిపించింది.












Click it and Unblock the Notifications