వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ‌రావ‌తి లో కొత్త శోభ : అసెంబ్లీ ఆకృతి సిద్దం ....

|
Google Oneindia TeluguNews

ఏపి రాజ‌ధాని అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణాల అకృతులు తుది రూపుకు వ‌చ్చాయి. ప‌రిపాల‌నా న‌గ‌రంలో కీల‌క‌మైన స‌చివాల‌యం..అసెంబ్లీ ల‌కు సంబంధించిన నిర్మాణ ఆకృతుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రిశీలించా రు. లండ‌న్ కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ శాసనసభ, సచివాలయ భవనాలకు సంబంధించి మూడేసి బాహ్య ఆకృతుల్ని సిద్ధం చేసి తీసుకొచ్చింది. గ‌తంలోనే శాస‌న‌స‌భ‌కు సంబంధిచి మూడంత‌స్తుల భ‌వ‌నం పై పొడ‌వైన ట‌వ‌ర్ తో ఉన్న ఆకృతిని ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. అయితే, దీనికి సంబంధించిన బాహ్య స్వ‌రూపానికి సంబంధించి కొత్త మార్పుల‌తో నార్మాన్ ఫోస్ట‌ర్ ఇప్పుడు కొత్త ఆకృతుల‌ను సిద్దం చేసింది. శాసనసభ భవనం ఆకృతిని బోర్లించిన 'లిల్లీ ఫ్లవర్‌'ని పోలిన విధంగా రూపొందించింది.

శాసనసభ పైనుంచి రాజధానిని వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేసింది. అసెంబ్లీ భవనం ఎత్తు 250 మీటర్లు, పొడవు 200 మీటర్లు, వెడల్పు 200 మీటర్లు ఉంటుంది. సాధారణ సందర్శకుల్నీ ఈ భవనంలోకి అనుమతిస్తారు. ఈ భవనం మధ్యలోంచి టవర్‌పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లు ఉంటాయి. ఇది వరకు ఇచ్చిన ఆకృతిలో టవర్‌లో 80 మీటర్ల ఎత్తు నుంచి మొత్తం రాజధాని నగరాన్ని వీక్షించేందుకు వీలుగా ఒక 'వ్యూయింగ్‌ గ్యాలరీ'ని ఏర్పాటు చేశారు.

New Structures of new Assembly and Secretariat are Ready in Amaravathi...
New Structures of new Assembly and Secretariat are Ready in Amaravathi...

శాసనసభ భవనంలో పార్లమెంటు భవనంలో మాదిరిగా ఏర్పాటు చేస్తున్న సెంట్రల్‌ హాల్‌ ప్రజా ప్రతినిధులు, అధికా రులు, ఉద్యోగులు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని సీఎం సూచించారు. హైకోర్టు భవనం బాహ్య ఆకృ తిని ఇది వరకే ఖరారు చేయగా, మరికొంత మెరుగులు దిద్దిన ఆకృతిని నార్మన్‌ ఫోస్టర్‌ బృందం తీసుకొచ్చింది. దానిపై ముఖ్య‌మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. ఆకృతులు ఫైన‌ల్ అయిన వెంటనే ఈ నెలాఖ‌రున అంటే 30వ తేదీన వీటికి సంబంధించి టెండ‌ర్లు ఆహ్వానించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

English summary
new structers of new assmebly and secretariat are ready. Norman Fosters from London created these structures and presented to AP government. Ap c.m suggeted changes in these structures and asked to finalise before this month. by 30th of November govt may call for tenders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X