వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్ ... డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే జైలుకే

|
Google Oneindia TeluguNews

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించిన వారికి ఫైన్ వేస్తున్న ఏపీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠిన తరం చెయ్యనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు.

 డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే ..

డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే ..

చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా వాహనాలు నడుపుతుంటారు. ఒకవేళ పట్టు బడితే ఫైన్ చెల్లించి వెళ్లిపోతుంటారు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే ఇప్పటి వరకు ఫైన్లు మాత్రమే వేసే ఈ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ . ఏపీలో వాహనచోదకులకు షాక్ ఇస్తుంది ఏపీ సర్కార్. లైసెన్స్ లేకపోతే జరిమానా విధించకుండా ఏకంగా జైలుకు పంపించాలని తీసుకున్న నిర్ణయం ఏపీలో వాహన చోదకులకు చెమటలు పట్టిస్తుంది.

 డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై ఉక్కుపాదం మోపనున్న ఏపీ సర్కార్

డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై ఉక్కుపాదం మోపనున్న ఏపీ సర్కార్


రోడ్డు భద్రత కోసం రవాణాశాఖ తమ రూల్స్‌ను కఠినతరం చేయనుందని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలను 20 శాతం తగ్గించాలనే ఉద్దేశంతో రవాణా శాఖాధికారులు పోలీసులతో కలిసి సంయుక్తంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను చెయ్యనున్నారు.అయితే ఇన్నిరోజులు కూడా కేవలం జరిమానాలతో సరిపెట్టిన రవాణా శాఖ, ఎంతకీ వాహన దారుల ప్రవర్తన మారకపోవడంతో, డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోకపోవటంతో ఇకనుండి రూల్స్ ని పాటించకుండా , డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జైలుకే

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జైలుకే

రోడ్డు సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ సూచనల ఆధారంగా ఏపీ సర్కార్ ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88,872 మంది వాహన చోదకులు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారి వల్లే చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించనున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కటకటాల వెనక్కు నెట్టనున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ ప్రక్రియ సులభతరం చేసిన సర్కార్

డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ ప్రక్రియ సులభతరం చేసిన సర్కార్

అంతే కాదు లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఇందు కోసం లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. కొత్త మోటారు వాహన చట్టం అనుగుణంగా విద్యార్హత నిబంధనను తొలగించిన ఏపీ సర్కార్ అందరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచిస్తుంది . త్వరలోనే డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులను పెంచి లైసెన్సులు సులువుగా జారీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఇక తాజా నిర్ణయంతో వాహనదారులు నిబంధనలు అతిక్రమించి చిక్కులు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని అలా చేస్తే పక్కా జైలుకు వెళ్తారని హెచ్చరిస్తున్నారు.

English summary
Most people drive vehicles without a license. If caught they pay fine. However, the decision to end the system of fines only if caught without a driving license,. AP Sarkar gives shock to motorists in AP. The decision to be sent to jail without a license otherwise imposes fines .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X