విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూర్య‌కుమారి కేసులో కొత్త ట్విస్ట్... కాలువ‌లోకి దూకి ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసుల అనుమానం

ఐదు రోజుల క్రితం విజ‌య‌వాడ‌లో అదృశ్య‌మైన డాక్టర్ సూర్య‌కుమారి కేసులో కొత్త మ‌లుపు చోటుచేసుకుంది. విజ‌య‌వాడ గుండా ప్ర‌వ‌హించే రైవ‌స్ కాలువ‌లో దూకి ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్త

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఐదు రోజుల క్రితం విజ‌య‌వాడ‌లో అదృశ్య‌మైన డాక్టర్ సూర్య‌కుమారి కేసులో కొత్త మ‌లుపు చోటుచేసుకుంది. విజ‌య‌వాడ గుండా ప్ర‌వ‌హించే రైవ‌స్ కాలువ‌లో దూకి ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

27-30 ఏళ్ల వ‌య‌సున్న యువ‌తిని కాలువ ఒడ్డున చూసిన‌ట్లు, ఆమెకు చెందిన బైక్‌, చెప్పులు దొరికిన‌ట్లు స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

dr surya-kumari-vijayawada

ప్ర‌స్తుతం 27 మంది ప్ర‌త్యేక పోలీసుల బృందం రైవ‌స్ కాలువ‌లో గాలింపు ప‌నులు చేప‌ట్టింది. రైవ‌స్ కాలువ ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల కాలువ మొత్తం గాలించ‌డం కొంచెం క‌ష్ట‌మైన ప‌నే అని ఎన్డీఆర్ఎఫ్ బృందం అభిప్రాయప‌డుతోంది.

మరోవైపు త‌మ కుమార్తె ఏమై ఉంటుందోన‌ని సూర్య‌కుమారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. డాక్టర్ సూర్యకుమారి కర్ణాటకకు చెందిన ఓ ఐఏఎస్ అధికారికి సోదరి. ఈ కేసులో ఇప్ప‌టికే విద్యాసాగ‌ర్ అనే వ్య‌క్తిని పోలీసులు విచారించారు. అదృశ్య‌మ‌వ‌డానికి ముందు సూర్య‌కుమారి, విద్యాసాగ‌ర్ ఇంటికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే!

English summary
Vijayawada Police are now suspecting that Dr Surya Kumari attempted suicide. This is the new twist in this case. Locals given information about her bike and chappals at Rivas canal in vijayawada. So police are investigating now in this angle also. Dr. Korlapati Surya Kumari, a government doctor at Telladevarapalli village in Visannapeta Mandal, went missing late Monday night. The incident came to light after the police registered a case on Wednesday, following a complaint by her mother Mariyamma on Tuesday. His other daughter is a Karnataka cadre IAS officer. The missing women was staying with her parents at Film Colony in Machavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X