హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్యాం పాత్ర ఏంటి..సుపారీనా: పోలీసుల అదుపులో కోగంటి స‌త్యం: రాంప్ర‌సాద్ హ‌త్య మిస్ట‌రీలో ట్విస్టు..!

|
Google Oneindia TeluguNews

బెజ‌వాడ క‌క్ష్య‌ల్లో భాగంగా జ‌ర‌గిన హ‌త్య‌లో కొత్త ట్విస్టులు తెర మీద‌కు వ‌స్తున్నాయి. బెజ‌వాడ‌లో నాటి వ్యాపారులు నేడు ప్ర‌త్య‌ర్దులుగా మారి హ‌త్య‌లు చేసుకొనే దాకా వెళ్లారు. హైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం సృష్టించిన బెజ‌వాడ వ్యాపారి రాం ప్ర‌సాద్ హ‌త్య కేసులో శ్యాం అనే వ్య‌క్తి తెర మీద‌కు వ‌చ్చాడు. తానే హ‌త్య చేసాన‌ని చెబుతున్నాడు. ఇదే స‌మ‌యంలో హ‌తుడి కుటుంబ స‌భ్యుల ఆరోప‌ణ‌ల మేర‌కు కోగంటి స‌త్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోగంటి స‌త్యం సుపారి ఇచ్చి శ్యాంతో హ‌త్య చేయించార‌ని భావిస్తున్నారు.

Recommended Video

పార్టీ నిలబడుతుందా? ముందుకెళ్తుందా ? అనుకున్నారు : సీఎం జగన్
రాం ప్ర‌సాద్ హత్య కేసులో ట్విస్ట్..

రాం ప్ర‌సాద్ హత్య కేసులో ట్విస్ట్..

విజ‌య‌వాడ‌లో వ్యాపారంలో వ‌చ్చిన త‌గాదాలు..ఆర్దికంగా తలెత్తిన మ‌న‌స్ప‌ర్ద‌ల కార‌ణంతో వ్యాపారి రాంప్ర‌సాద్ హైద‌రా బాద్‌లో హ‌త్య‌కు గుర‌య్యారు. రాం ప్ర‌సాద్‌ను హ‌త్య చేయించింది కోగంటి స‌త్యం అంటూ హుతుడి బంధువులు ఆరోపి స్తున్నారు. ఇదే స‌మ‌యంలో శ్యాం అనే వ్య‌క్తి మీడియా ఛాన‌ళ్ల‌ను ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. రాం ప్ర‌సాద్ త‌న‌కు 15 ల‌క్ష లు బాకీ ఉన్నాడ‌ని..అత‌డిని చంపితే 15 ల‌క్ష‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న బావ శ్రీను చెప్ప‌టంతోనే చంపానంటూ శ్యాం కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. దీని పైన పోలీసులు కూపీ లాగుతూనే..మ‌రోవైపు కోగంటి స‌త్యం అల్లుడిని విచారించారు.ఆత‌ని ద‌గ్గ‌ర నుండి సేక‌రించిన స‌మాచారం మేర‌కు కోగంటి స‌త్యంను అదుపులోకి తీసుకున్నారు. కోగంటి స‌త్యం సుపారీ ఇచ్చి శ్యాం ద్వారా రాం ప్రసాద్‌ను హ‌త్య చేయించిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, తానే హ‌త్య చేసానంటూ మీడియా ముందుకు వ‌చ్చిన శ్యాం మ‌రో ఇద్ద‌రితో క‌లిసి పోలీసుల ముందు లొంగిపోతానని చెబుతున్నారు. దీంతో.. ఒక‌టి రెండో రోజుల్లోనే పోలీసులు ఈ హ‌త్య కేసు మిస్ట‌రీ

 కోగంటి స‌త్యం చుట్టూ కేసు..

కోగంటి స‌త్యం చుట్టూ కేసు..

రాం ప్రసాద్..ఇప్పుడు హ‌త్యారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కోగంటి స‌త్యం 2008లో వ్యాపార భాగ‌స్వామ‌లుగా ఉండేవారు.
కోగంటి సత్యం నిర్వహిస్తున్న కామాక్షి స్టీల్‌ ట్రేడర్స్‌లో భాగస్వామిగా చేరారు. 2013లో కామాక్షి స్టీల్‌ ట్రేడర్స్‌లో జరిగిన వ్యాపార లావాదేవీల లెక్కల్లో కోట్లాది రూ పాయలు అవకతవకలు జరిగినట్లు కోగం టి సత్యం అనుమానించారు. ఈ నేపథ్యం లో రాంప్రసాద్‌, సత్యం మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో రాంప్రసాద్‌ సంస్థ నుంచి బయటకొచ్చారు. ఇరువురూ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నా రు. కిడ్నాప్‌ కేసులో కోగంటి సత్యం 20 రో జులపాటు జైలుకెళ్లి వచ్చారు. దీంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో రాంప్రసాద్‌ కుటుంబం 2015 లో హైదరాబాద్‌కు మకాం మార్చింది. రెండేళ్ల క్రితం పరిగిలో అభిరామ్స్‌ స్టీల్స్‌ పేరిట ఫ్యాక్టరీని ఏర్పాటు చేసారు. కోగంటి స‌త్యం కోట్ల రూపాయాలు త‌మ‌కు ఇవ్వాల‌ని రాం ప్రసాద్ కుటుంబ స‌భ్యులు చెబుతుంటే.. కోగంటి స‌త్యం మాత్రం త‌న‌కే రాం ప్ర‌సాద్ బాకీ ఉన్నాంటున్నారు.

పోలీసుల అదుపులో కోగంటి స‌త్యం..

పోలీసుల అదుపులో కోగంటి స‌త్యం..

రాం ప్రసాద్ వ్యాపార లావాదేవీల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం సేక‌రించిన పోలీసులు ఈ వ్య‌వ‌హారం కోగంటి స‌త్యం అల్లుడుని ప్ర‌శ్నించారు. విజ‌య‌వాడ‌కు వెళ్లి అక్క‌డా విచారించారు. శ్యాం అనే వ్య‌క్తి తానే చంపానంటూ టీవీల ముందుకు వ‌చ్చినా..పోలీసులు మాత్రం కోగంటి స‌త్యం మీదే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో..కోగంటి స‌త్యం ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. టీవీల ముందుకు వ‌చ్చిన శ్యాంతో పాటుగా మ‌రో ఇద్ద‌రిని సైతం పోలీసులు త‌మ అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ కార్యాల‌యంలో ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగు తోంది. రేప‌టికి కేసు వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తుంద‌ని పోలీసులు చెబుతున్నారు.

English summary
New twist in industrialist Ram Prasad murder case. New person by name Shyam saying he murder Ramprasad with his assistants. At the same time Hyderabad Police Taken Koganti Satyam in to custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X