విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచిత వ్యవహారంలో ప్రభుత్వం మరో ట్విస్ట్: బయటకొచ్చిన జీవో: అశోక్ గజపతిరాజు కుమార్తె సైతం..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్..సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా సంచిత నియామక వ్యవహారంలో కొత్త ట్విస్ట్ ఇది. ప్రభుత్వం సంచిత నియామకానికి సంబంధించిన జీవోను సైతం రహస్యంగా ఉంచిందని..నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని బీజేపీతో పాటుగా అశోక్ గజపతి రాజు ఆరోపించారు.

కనీసం జీవో కూడా దొరకటం లేదని చెప్పిన అశోక్..తనకు నోటీసు కూడా ఇవ్వ కుండా తొలిగించారని వాపోయారు. తమ ట్రస్ట్ పరిధిలో ఉన్న దేవాలయాలు..వాటి భూముల కోసమే ఈ రకంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. అయితే, ఇదే సమయంలో సంచిత నియామకం పైన ప్రభుత్వం జారీ చేసిన జీవో వెలుగు లోకి వచ్చింది. ఆ జీవోలో పేర్కొన్న అంశాలు మరింత ఆసక్తి కరమైన చర్చకు కారణమయ్యాయి.

విజయనగరంలో రాజుగారి శకం ముగిసిందా ? రాజకీయాలకు గుడ్ బై !

 అశోక్ గజపతిరాజు కుమార్తెకు సైతం..

అశోక్ గజపతిరాజు కుమార్తెకు సైతం..

ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన ఈ జీవో జారీ చేసింది. అయితే జీవో జారీ చేసిన సమయం నుండి కాన్ఫిడెన్షియల్ గా ఉంచింది. ఆ వెంటనే సంచిత తనకు అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్..సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దీని పైన రాజకీయంగా దుమారం చెలరేగింది. మహిళకు ఆ పదవులు ఇచ్చే అవకాశమే లేదని వాదన తెర మీదకు వచ్చింది.

ఇక, బీజేపీ నేతలు సైతం ఈ వ్యవహారాన్ని తప్పు బట్టారు. సంచితను పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర నాయకత్వానికి నివేదిక పంపారు. అయితే, ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సంచితకు ఛైర్మన్ హోదా ఇస్తూనే..అశోక్ గజపతి రాజు కుమార్తె అయిన అతిధి గజపతి రాజు తో పాటుగా ఆయన సోదరి అయిన సునీతను సైతం మన్సాస్ ట్రస్ట్ సభ్యులుగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

జీవో ద్వారా విమర్శలకు సమాధానంగా..

ప్రభుత్వం రహస్య జీవో ద్వారా సంచిత నిమాయకం చేపట్టిందనే విమర్శలకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ఇప్పుడు అశోక్ గజపతి రాజు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం పైన విమర్శలు చేయటం తో పాటుగా..తమ కుటుంబ వారసత్వం గురించి వివరించారు. ఇతర మతస్థులకు బోర్డులో సభ్యత్వం కల్పిస్తే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీంతో..ప్రభుత్వం ఈ జీవోను బయట పెట్టంది. అందులో ట్రస్టు సభ్యులుగా అశోక్ గజపతి కుమార్తె కు అవకాశం ఇవ్వటం కొత్త ట్విస్ట్.

Recommended Video

Modi's Reaction on Ashok Gajapathi Raju, Sujana Chowdary's resign | Oneindia Telugu
వీరికి కూడా సభ్యత్వం

వీరికి కూడా సభ్యత్వం

అదే విధంగా అశోక్ సోదరుడు అయిన ఆనంద గజపతి రాజు చిన్న కూతురు ఊర్మిళా గజపతి రాజులకు బోర్డులో సభ్యత్వం కల్పించారు. వీరితో పాటుగా విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్ర స్వామి..విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సైతం సభ్యులుగా నియమితులయ్యారు. ఇప్పుడు ఈ నియామకాల విషయం బయటకు అధికారికంగా జీవో ద్వారా తెలియటంతో దీని పైన అశోక గజపతి రాజు కుటుంబం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

English summary
AP govt had released the secret GO pertaining to Sanchita Gajapati Raju's appointment as the Trust Chairman of Mansas trust. This was released soon after former minister Ashok Gajapathi Raju had alleged that AP govt did not issue any Go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X