అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ వ‌ర్సెస్ గోరంట్ల మాధ‌వ్ : నాటి వివాదానికి కొత్త ట్విస్ట్‌ : ఎన్నిక‌ల వేళ అనంత‌లో మ‌రో ర‌గ‌డ‌..!

|
Google Oneindia TeluguNews

గ‌తంలో సంచ‌ల‌నం సృష్టించిన ఎంపి జేసి...పోలీసు అధికారి గోరంట్ల మాధ‌వ్ అంశం..ఇప్పుడు మ‌రో సారి తెర మీద కు వ‌చ్చింది. నాడు నేరుగా మాట‌ల యుద్దంగ సాగా..ఇప్పుడు అది న్యాయ పోరాటం గా మారుతోంది. తనను వ్యక్తిగ తంగా మాధవ్‌ దూషించారని ఆరోపిస్తూ ఇప్పటికే ఆయన పోలీస్‌ స్టేషన్, హైకోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఎక్కడా మాధవ్‌ తప్పు చేయలేదని తేలడంతో సోమవారం తాడిపత్రి కోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసు నమోదు చేయాలని రిట్‌ దాఖలు చేశారు.

జేసీ వ‌ర్సెస్ మాధ‌వ్..
అనంత‌పురం జిల్లాలో ప్రభోదానంద ఆశ్రమ ఘటన వ్యవహారంలో అప్పటి డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పరుష వ్యాఖ్యలతో దూషించారు. మొత్తం పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యం దెబ్బతినేలా పోలీసులను అభివ ర్ణించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతో పాటు ఉద్యోగ వర్గాలు, సామాన్య ప్రజల్లోనూ జేసీపై తీవ్ర వ్యతిరేకత పెల్లు బికింది. ఈ ఘటన తర్వాత పోలీసు సంఘం తరఫున అప్పటి పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్, కార్యదర్శి మాధవ్‌ ఇకపై ఎవరైనా పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే 'నాలుక కోస్తాం' అని మాధవ్‌ అన్నారు. అయితే తనను వ్యక్తిగతంగా దూషించారని జేసీ భావించి తాడిపత్రిపోలీసుస్టేషన్‌లో మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్నట్లు మాధవ్‌ ఎక్కడా జేసీని వ్యక్తిగతంగా కించపరచలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.

new twist in Jc Diwakar Reddy vs Gorantla Madhav episode..

హైకోర్టును ఆశ్ర‌యించినా..
పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ జేసీ హైకోర్టును ఆశ్రయించి రిట్‌ దాఖలు చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ కూడా కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. మాధవ్‌ వ్యాఖ్యలు పరిశీలించామని, ఎక్కడా జేసీని వ్యక్తిగతంగా బెదిరించడం, కించపరచడం చేయలేదని అందులో పేర్కొన్నారు. దీంతో పాటు న్యాయపరంగా చిక్కులు ఎదురుకా కుండా న్యాయసలహా కోసం ఈ అంశాన్ని 'డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌'కు ఎస్పీ సిఫారసు చేశారు. మొత్తం వ్యవహారం లో కూడా గోరంట్ల మాధవ్, జేసీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సొసైటీని ఉద్దేశించి జనరల్‌గా చేసిన వ్యాఖ్యలను, జేసీ తనకు ఎలా ఆపాదించుకుంటారని పోలీసుల తరఫు న్యాయవాదులు కూడా వాదించారు. దీంతో ఎంత ప్రయత్నించినా కేసు నమోదు చేయలేదనే భావనకు జేసీ వచ్చారు.

తాజాగా ప్ర‌యివేటు కేసు
ఈ వ్యవహారం జరుగుతుండగానే గోరంట్ల మాధవ్‌ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాధవ్‌ను హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా నియమించారు. దీంతో.. తాజాగా జేసి ఈ వ్య‌వ హారంలో హైకోర్టు పరిధిలో ఉన్న కేసును తిరిగి కింది కోర్టుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి తాడిప త్రి కోర్టుకు వెళ్లి మాధవ్‌పై ప్రైవేటు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. నిజానికి పైకోర్టు పరిధిలో ఉన్న కేసుల పై కింది కోర్టులను ఆశ్రయిస్తే వాటిని విచారణకు స్వీకరించరని న్యాయనిపుణులు అంటున్నారు. అధికారాన్ని అడ్డుపె ట్టు కుని మాధవ్‌ను కేసులో ఇరికించే కుట్ర జ‌రుగుతోంద‌ని వైసిపి భావిస్తోంది.

English summary
MP JC Diwakar Reddy Vs ex Police officer Gorantla Mahdav case still continue. JC filed private case against Madhav in Tadipatri court. Madhav presently working for ycp in Anantapur dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X