విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే అనిత అనుమానం: లావణ్య కేసులో మరో కొత్త ట్విస్ట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఏపీలోని విశాఖలో దాదాపు పదిహేను రోజుల క్రితం లావణ్య అనే మహిళ మృతి చెందారు. నలుగురు యువకులు కారుతో ఆమె ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టడం వల్ల మృతి చెందారు. ఈ కేసు విషయమై తెలుగుదేశం పార్టీ నేత, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత గళం విప్పారు.

ఈ కేసు విషయంలో పోలీసులు చెబుతున్న వాదన పైన ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల వాదన పైన తనకు అనుమానాలున్నాయని ఆమె ఆదివారం నాడు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే తమ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయక తప్పని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

New twist in Lavanya murder case in Visakhapatnam

ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ తన స్నేహితులతో కలిసి ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టిన కారణంగా లావణ్య అనే గృహిణి చనిపోయినట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. అయితే, పోలీసుల విచారణలో ఉద్దేశ్యపూర్వకంగా ఢీకొట్టినట్లు తేలలేదు.

కారుతో రెచ్చిపోయిన పోకిరీలు: వెంటాడి ప్రాణం తీశారు

ఆ నలుగురు యువకులు తాగిన మత్తులో లావణ్య వెళ్తున్న బైకును ఢీకొట్టినట్లుగా తేలింది. ఇందుకు సంబంధించి పోలీసులు ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్‌ను, మరో యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

'లావణ్య కేసులో రాజకీయ ఒత్తిళ్లు లేవు': మృతికి కారణం ఇదీ!

కాగా, లావణ్య భర్తతో కలిసి బైక్ పైన ఆలయానికి వెళ్లి వస్తుండగా నిందితుల కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో లావణ్య మృతి చెందారు. ఇది ఇది కలకలం రేపింది. కొద్ది రోజుల పాటు హేమంత్ కుమార్ పోలీసులకు చిక్కలేదు.

ఏం జరిగింది?: వేధించి, వెంటాడి ప్రాణం తీసిన కేసులో పురోగతి

ఆ తర్వాత అరెస్టు చేశారు. అయితే, హేమంత్ కుమార్ కేసును తనకు అనుకూలంగా మార్చుకున్న తర్వాత పోలీసులకు చిక్కాడనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే వనిత పోలీసుల వాదనపై అనుమానం వ్యక్తం చేస్తున్నందున ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

English summary
New twist in Lavanya murder case in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X