వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సదావర్తి భూముల కేసులో మరో మలుపు: ఆళ్ల రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో షాక్, కానీ

సదావర్తి భూముల వ్యవహారం మంగళవారం నాడు మరో మలుపు తిరిగింది. హైకోర్టులో ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిగింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: సదావర్తి భూముల వ్యవహారం మంగళవారం నాడు మరో మలుపు తిరిగింది. హైకోర్టులో ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిగింది.

సదావర్తి భూములపై కొత్త ట్విస్ట్: రూ.10 కోట్లకు ఆళ్ల రెడీ, బాబుకు షాక్ సదావర్తి భూములపై కొత్త ట్విస్ట్: రూ.10 కోట్లకు ఆళ్ల రెడీ, బాబుకు షాక్

ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రూ.27.44 కోట్లను చెల్లించారు. కానీ ఆల్ ఇండియా బ్రాహ్మణ అసోసియేషన్ ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది.

New twist in Sadavarti lands issue

దీంతో మరోసారి ఓపెన్ యాక్షన్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లో జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని చెప్పింది.

ఆళ్ల చెల్లించిన రూ.27.44 కోట్లను బేస్ ప్రైస్‌గా నిర్ణయించి వేలం నిర్వహించాలని సూచించింది. వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే అప్పుడు ఎమ్మెల్యే ఆళ్లకు సదావర్తి భూములు చెందుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది.

అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. సదావర్తి భూములకు తాను రూ.27.44 కోట్లు చెల్లిస్తానని, వాటిని తనకు ఇవ్వాలని హైకోర్టుకు ఆళ్ల చెప్పారు. దానికి అంగీకరించడంతో ఆయన డబ్బును ఏపీ ఎండోమెంట్ కమిషన్‌కు చెల్లించారు. ఇప్పుడు బ్రాహ్మణ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్‌తో కొత్త మలుపు తిరిగింది. వేలంలో ఎవరూ ముందుకు రాకుంటే భూములు ఆయనకే చెందుతాయి.

English summary
New twist in Sadavarti lands issue. All India Brahmin Association filed impled petition in High Court over Sadavarti land issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X