చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాడిస్ట్ భర్త కేసులో ఊహించని మలుపు: 18 రకాల పొటెన్సీ టెస్ట్‌లు, పాజిటివ్, బెయిల్

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇటీవల శాడిస్ట్ భర్త ఉదంతం వెలుగు చూసింది. ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. భర్త రాజేష్‌కు న్యాయస్థానం గురువారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఆయన గత కొంతకాలంగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు లైంగిక పటుత్వ పరీక్షలలో రాజేష్‌కు పాజిటివ్ వచ్చింది. దీంతో కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. ఆయన లైంగిక పటుత్వ పరీక్షల నివేదికలు అధికారులకు అందాయి. దీంతో న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది.

 18 రకాల పొటెన్సీ టెస్టులు

18 రకాల పొటెన్సీ టెస్టులు

రాజేష్ అడ్వోకేట్ మాట్లాడుతూ.. ఉస్మానియా మెడికల్ బోర్డు అతనికి 18 రకాల పొటెన్సీ పరీక్షలు చేసిందని చెప్పారు. ఈ పరీక్షల్లో అతను వంద శాతం అతను సంసారానికి పనికి వస్తాడని తేలిందన్నారు. కోర్టు అతనికి, అతని తల్లిదండ్రులకు బెయిల్ ఇచ్చిందన్నారు.

రాజేష్ ఏం చేస్తారు

రాజేష్ ఏం చేస్తారు

దీంతో అతను సంసారానికి పనికి వస్తాడా రాడా అని తేల్చారు. పరీక్షల్లో అతను సంసారానికి పనికి వస్తాడని తేలింది. కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన శైలజతో కలిసి జీవిస్తాడా, ఆమె అందుకు సిద్ధంగా ఉందా అనేది తేలాల్సి ఉంది. అతని తల్లిదండ్రులకు కూడా బెయిల్ వచ్చింది.

 తల్లిదండ్రులు మాట్లాడుతూ

తల్లిదండ్రులు మాట్లాడుతూ

బెయిల్ వచ్చిన అనంతరం రాజేష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. శైలజ కావాలనే తన కొడుకు జీవితాన్ని నాశనం చేసిందని వాపోయారు. రాజేష్ 45 రోజులకు పైగా జైలులో ఉన్నాడు.

తొలి రాత్రి నరకం

తొలి రాత్రి నరకం

గతేడాది నవంబర్‌ 1న గంగాధర నెల్లూరు మండలం దామరగుంటకు చెందిన మునికృష్ణా రెడ్డి కుమార్తె శైలజను, జీడి నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. అయితే, తొలిరాత్రే రాజేష్‌ సంసార జీవితానికి పనికి రాడంటూ శైలజ తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆగ్రహావేశానికి లోనైన రాజేష్‌ మృగంలా ప్రవర్తించాడు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. మొదటి రాత్రే నవ వధువుపై దారుణానికి పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలకు తీవ్రంగా శైలజ గాయపడింది.

అందంగా కనిపించిన శైలజ

అందంగా కనిపించిన శైలజ

తొలిరోజే ఇలాంటి సంఘటన ఎదురవ్వడంతో నవ వధువు తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ముఖం గుర్తించలేనంతగా గాయాలతో కమిలిపోయింది. పెళ్లిపీటలపై అందంగా కనిపించిన శైలజ అదే రోజు రూపం మారిపోయి చిత్తూరు ఆసుపత్రిలో చేరారు. భర్త వికృత చేష్టలతో తీవ్రంగా గాయపడ్డ శైలజ అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కోలుకుంటోంది.

English summary
There is a New Twist in Sadist Husband Rajesh's Case. Sailaja complained that Rajesh is impotent and on revealing which he beat her brutally on first night. It is known that Chittoor police filed petition in court for the permission of potency test to Rajesh over the complaint of his wife Sailaja. Rajesh's advocate Trimurthy said to media that Osmania Medical Board has conducted 18 types of potency tests on Rajesh and the medical report of the tests proved that Rajesh is 100% potent which was presented in the court. He said the court has given bail to Rajesh and his parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X