వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊహించని ట్విస్ట్: మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు! చంద్రబాబు చెప్పిందే జరిగింది

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు శుక్రవారం ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటికే, గత ఏడాది జగన్ పైన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును హైకోర్టు ఎన్ఐఏకు (జాతీయ దర్యాఫ్తు సంస్థ) అప్పగించింది. జగన్ అక్రమాస్తుల కేసులోను కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.

జగన్ అక్రమాస్తుల కేసు ఏళ్లుగా విచారణ సాగుతోన్న విషయం తెలిసిందే. 11 చార్జీషీట్లు దాఖలు చేశారు. నాలుగు ఛార్జీషీట్లపై రెండున్నరేళ్లుగా విచారణ సాగుతోంది. ఇప్పుడు అది మళ్లీ మొదటికి వచ్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జగన్, విజయసాయి రెడ్డి, ఇతర నిందితులందరి పైనా మళ్లీ మొదటి నుంచి విచారణ జరగనుంది.

జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసింది!!జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసింది!!

మళ్లీ మొదటికి.. కారణం ఇదే

మళ్లీ మొదటికి.. కారణం ఇదే

ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి రావడానికి కారణం ఉంది. ఇటీవల ఉమ్మడి హైకోర్టు విడిపోయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి వెంకటరమణ బదలీ పైన ఏపీకి వెళ్లారు. ఆయన స్థానంలో కొత్తగా జడ్జిని నియమించలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరు జడ్జిగా వచ్చినా తిరిగి వాదనలను మొదటి నుంచి వినాల్సిందే. విచారణలో భాగంగా శుక్రవారం (జనవరి 4) జగన్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు. విచారణను కోర్టు మూడు వారాల పాటు వాయిదా వేసింది. తిరిగి 25వ తేదీన విచారణకు ప్రారంభం కానున్నట్లు తాత్కాలిక జడ్జి తెలిపారు.

డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు

డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు

జగన్ ఆస్తుల కేసులో సీబీఐ ఛార్జీషీట్లను దాఖలు చేసింది. విచారణ ప్రక్రియలో భాగంగా జగన్, విజయసాయి రెడ్డి సహా ఇతర నిందితులు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. నేరానికి ఎలాంటిసంబంధం లేకుండానే తమపై అక్రమంగా కేసులు బనాయించారని, కావున ఎఫ్ఐఅర్, ఛార్జీషీట్ల నుంచి తమను తప్పింటాలని పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై వాదనలు కొనసాగుతున్నాయి. రెండున్నరేళ్లుగా నాలుగు ఛార్జీషీట్లపై వాదనలు పూర్తయ్యాయి. ఇప్పుడు జడ్జి ఏపీకి బదలీ కావడంతో వచ్చే న్యాయవాది డిశ్చార్జ్ పిటిషన్ పైన మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుంది.

అన్ని కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వాలని

అన్ని కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వాలని

ఒక్కో ఛార్జిషీట్‌లో తీర్పు వెల్లడించినట్లయితే ఇతర కేసులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అందుకే అన్ని కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వాలని గతంలో సీబీఐ న్యాయస్థానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు జరగనున్నాయి.

చంద్రబాబు ముందే చెప్పారు

చంద్రబాబు ముందే చెప్పారు

మరోవైపు, హైకోర్టు విభజన, జగన్ అక్రమాస్తుల కేసు అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు గతంలోనే జోస్యం చెప్పారు. ఆయన అంచనా నిజమే అయింది. ఉమ్మడి హైకోర్టు విడిపోతే జగన్ కేసుల విచారణ మళ్లీ మొదటికి వస్తుందని చెప్పారు. కేసుల విచారణను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకే జగన్‌తో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందని ఇటీవల ఆరోపించారు. హైకోర్టు భవనం పూర్తికాకుండానే విభజన చేశారని, హడావుడిగా కోర్టులను తరలించారని మండిపడ్డారు.

English summary
New twist in YSR Congress party chief YS Jagan Mohan Reddy DA case. Already AP CM Chandrababu Naidu predicted about this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X