• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ ఫాలోయర్స్ : టార్గెట్ సాహో.. ట్రోలింగ్ తో రచ్చ : జగన్ కేంద్రంగా....!!

|
  ప్రభాస్ సాహో లక్ష్యంగా టీడీపీ కేడర్ || TDP Followers Targets Prabhas Saaho Movie || Oneindia Telugu

  టీడీపీ శ్రేణులకు వైసీపీ..ముఖ్యమంత్రి జగన్ మాత్రమే కాదు..ఇప్పుడు ప్రభాస్ సైతం టార్గెట్ గా మారారు. ప్రభాస్ సినిమా సాహో పైన టీడీపీ అభిమానులు వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా ప్రభాస్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణంగా చెబుతున్నారు. బీజేపీలో సీనియర్ గా ఉన్న కృష్ణంరాజు సైతం చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసారు. దీనిని జీర్ణించుకోలేని కొందరు టీడీపీ అభిమానులు ఇప్పుడు సాహో చిత్రం పైన సోషల్ మీడియా ద్వారా నెగటివ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. రాజమౌళితో హిట్ కొట్టిన ఏ హీరోకు అయినా తర్వాత అన్నీ ఫ్లాప్ లే వచ్చాయని..దీనికి ఎవరూ మినహాయింపు కాదంటూ సాహో పై తమ అభిప్రాయాల పేరుతో ప్రచారం మొదలు పెట్టారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో సైతం ఇదే విధంగా జరిగింది. ఇక, ఇప్పుడు అదే తరహాలో ప్రభాస్ టీడీపీ శ్రేణులకు టార్గెట్ అవుతున్నారు..ఇంతకీ ఏం జరుగుతోంది..

   ప్రభాస్ లక్ష్యంగా టీడీపీ కేడర్..

  ప్రభాస్ లక్ష్యంగా టీడీపీ కేడర్..

  టీడీపీ అభిమానుల్లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హీరో ప్రభాస్ ను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పోస్టు చేస్తున్నారు. తాజాగా హీరో ప్రభాస్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ముఖ్యమంత్రి జగన్ పైన అనుకూల కామెంట్లు చేసారు. అందులో ముఖ్యమంత్రి జగన్ యువకుడు అంటూనే..మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. తనకు పెద్దగా రాజకీయాలు తెలివని..ఏపీ ఎంతో సుందర ప్రాంతం అంటూ ..వేచి చూద్దామని వ్యాఖ్యానించారు. దీంతో.. తెలుగుదేశం అభిమానించే కొందరు సోషల్ మీడియా వేదికగా సాహో వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు వీరికి కౌంటర్ గా ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సమాధానాలు ఇస్తున్నారు. జగన్ కు అనుకూలంగా ప్రభాస్ మాట్లాడటే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ చేస్తున్న ప్రచారం సాహో సినిమా మీద ప్రభావం చూపిస్తుందా అనే చర్చ మొదలైంది. ప్రభాస్ వ్యతిరేక ప్రచారంలో వారి లక్ష్యం సాహో సినిమానే కనిపిస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రచారం కొసాగిస్తోంది. అక్కడే సెంటిమెంట్ తో ప్రభాస్ అభిమానుల్లో అలజడి కలిగించే ప్రయత్నం జరుగుతోంది.

  కృష్ణంరాజు పైనా ఆగ్రహంతోనే...

  కృష్ణంరాజు పైనా ఆగ్రహంతోనే...

  టీడీపీ శ్రేణులు ఇప్పుడు ప్రభాస్ ను టార్గెట్ చేయటం వెనుక మరో కారణం తెర మీదకు వచ్చింది. అందులో ప్రభాస్ పెద్దనాన్న అయిన కృష్ణంరాజు ఈ మధ్య కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో క్రియా శీలకంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అనేక అంశాల మీద స్పందించారు. ఆయన పార్టీ పరంగా చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు టీడీపీ అభిమానులకు రుచించటం లేదు. దీంతో..ఇప్పుడు ఆయన వారసుడు ప్రభాస్ ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే..ప్రభాస్ తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు..ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్న సాహో సినిమా ప్రమోషన్ ను దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభాస్ అభిమానులు ఆరోపిస్తున్నారు. రాజమౌళితో హిట్ కొట్టిన ఏ హీరోకు అయినా తర్వాత అన్నీ ఫ్లాప్ లే వచ్చాయని..దీనికి ఎవరూ మినహాయింపు కాదంటూ ట్రోలింగ్ చేయటం ద్వారా పరోక్షంగా సాహో ఫ్లాప్ అవుతుందనే ప్రచారం అప్పుడే మొదలు పెట్టేసారు. దీనికి స్పందనగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రీరిలీజ్ ఫంక్షన్ స్పందన గురించి వస్తున్న కామెంట్లను.. స్పందనను ప్రతిగా ట్రోల్ చేస్తున్నారు.

  సాహో ఎఫెక్ట్ అవుతుందా..

  సాహో ఎఫెక్ట్ అవుతుందా..

  ప్రభాస్ సినీ కేరీర్ లో బాహుబలి తరువాత దాదాపు 350 కోట్ల ఖర్చుతో రూపుదిద్దుకుంటున్న సినిమా సాహో. ఈ సినిమా ఈ నెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా ఇదే సమయం తమకు అనుకూలంగా టీడీపీ లోని కొందరు శ్రేణులు భావిస్తున్నారు. సినిమా ముందు ఈ ప్రచారం ద్వారా సాహో మీద నెగటివ్ టాక్ తేవాలనే ప్రయత్నంగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభాస్ అభిమానులు గతంలో జరిగిన అంశాలను గుర్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సినిమా హాల్స్ సైతం దొరక్కకుండా చేసిన ప్రయత్నాలు.. చేసిన వ్యతిరేక ప్రచారం అంశాలను వివరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు బాగోలేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. అయితే అందులో పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సైతం ప్రభాస్ సినిమా గురించి పరోక్షంగా అటువంటి ప్రచారమే చేస్తున్నా..అది ఎంత మేర ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు రాజకీయంగానే కాకుండా..సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తి పెంచుతోంది.

  English summary
  New war started in social media between TDP Followers and prabhas fans. Recently Prabhas positively responded on CM Jagan.with this comments now TDP followers tarhet Prbahas new movie Sahoo.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X