కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కుమారి, కరోనా కుమార్: అప్పుడే జన్మించిన పసికందులకు నామకరణం, కడప జిల్లాలో..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పేరు చెబితే చాలు గజగజ వణికే పరిస్థితి ఏర్పడింది. అగ్రరాజ్యం అమెరికాను కూడా భయపెడుతోంది. అయితే వైరస్‌కు మందు లేకపోవడంతో నివారణ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. నోటికి మాస్క్ పెట్టుకొని, శానిటైజర్‌తో చేతిని శుభ్రంగా కడుక్కొవాలని.. సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. కరోనా అంటువ్యాధిపై ప్రజల్లో అనుమానాలు, అపోహలు ఉన్న నేపథ్యంలో ఇటీవల జన్మిస్తోన్న వారికి కరోనా పేరుతో పేర్లు పెడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు పేర్లు పెట్టిన విషయం వెలుగుచూసింది.

Recommended Video

కరోనా వైరస్ Viral : New Born Babies Named 'కరోనా Kumari' and 'కరోనా Kumar' in AP’s Kadapa
కరోనా కుమారి, కరోనా కుమార్

కరోనా కుమారి, కరోనా కుమార్

కడప జిల్లా వెంపల్లి మండలానికి చెందిన రమాదేవి, శశికళ ఇద్దరు ఇటీవల ఎస్ఎఫ్ బాషా ఆస్పత్రిలో డెలివరీ అయ్యారు. 4వ తేదీన రమాదేవి పాప, 5వ తేదీన శశికళకు బాబు జన్మించారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ పేరు పెట్టి ప్రజలకు ఉన్న అపోహలు తొలగించాలని డాక్టర్ బాషా ఇద్దరికీ సూచించారు. తమ బిడ్డలకు ప్రాణం పోసిన వైద్యుని మాటకు విలువనిచ్చి.. ఇద్దరూ కరోనా పేరుతో పేర్లు పెట్టారు.

వైద్యుని సూచన మేరకు

వైద్యుని సూచన మేరకు

పాపకు కరోనా కుమారి, బాబుకు కరోనా కుమార్ అనే పేర్లు పెట్టారు. తన మాటకు బిలువనివ్వడంతో వైద్యుడు డాక్టర్ బాషా కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కానీ రమాదేవి, శశికళ నిర్ణయంపై మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు ఓకే.. వారు పెద్దయ్యాక పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. వైరస్ పేరు పెట్టారు అని సమాజంలో చిన్నచూపునకు గురవ్వరా అని అడిగారు. కానీ వారి మాటలను ఆ ఇద్దరు తల్లులు లెక్కచేయలేదు.

యూపీలో కూడా..

యూపీలో కూడా..

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో కూడా రెండుం డెలివరీలు జరిగాయి. వారు కరోనా అని ఒకరు, లాక్‌డౌన్ అని మరొకరు పేరు పెట్టారు. జనతా కర్ఫ్యూ రోజు గోరఖ్‌పూర్‌లో పాప జన్మించడంతో.. కరోనా అని పేరు పెట్టారు. డియోరియాలో బాబు జన్మించడంతో లాక్ డౌన్ పేరు పెట్టారు. వైరస్ సోకుతోన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

English summary
Two newborn babies, born in two different families, were named 'Corona Kumar' and 'Corona Kumari', as they were born during the time the country deals with the COVID-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X