చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీపై చెన్నై కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్: ఆ జిల్లాలో కరోనాకు కారణం: రెండువేలను దాటేసిన కేసులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే 24 గంటల్లో వెలుగులోకి వచ్చిన వాటి సంఖ్య సగానికి తగ్గినట్టే. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కొన్ని పాజిటివ్ కేసులు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌తో ముడిపడి ఉండటం ఆందోళనకు దారి తీస్తోంది. ఒక్క జిల్లాపైనే దాని ప్రభావం తీవ్రంగా పడింది. కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఎనిమిది మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

ట్రంప్ అరికాలి మంట నెత్తికెక్కేలా: కరోనాపై అడ్డంగా వాదిస్తోన్న చైనా: వుహాన్‌లో పుట్టలేదంటూట్రంప్ అరికాలి మంట నెత్తికెక్కేలా: కరోనాపై అడ్డంగా వాదిస్తోన్న చైనా: వుహాన్‌లో పుట్టలేదంటూ

రాష్ట్రంలో కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 2018కి పెరిగింది. ఇందులో యాక్టివ్ కేసులు 975. ఇప్పటిదాకా 998 మంది కరోనా వైరస్ కోరల నుంచి తప్పించుకోగలిగారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఐసొలేషన్ వార్డుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 45 మంది మరణించారు. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డిశ్చార్జి అయిన వారి సంఖ్య భారీగా ఉంటోంది. ఈ మూడు జిల్లాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి.

Newly 38 Covid-19 Positive cases have reported in Andhra Pradesh. Total reach 2018

24 గంటల్లో రాష్ట్రంలో కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో తొమ్మిది చొప్పున పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతపురంలో ఎనిమిది, గుంటూరులో అయిదు కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా, విశాఖపట్నంలల్లో మూడు చొప్పున, నెల్లూరులో ఒక కేసు నమోదైంది. కాగా.. చిత్తూరు జిల్లాలో నమోదైన తొమ్మిది పాజిటివ్‌లల్లో ఎనిమిది కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్‌తో ముడిపడి ఉన్నాయి. అక్కడికి వెళ్లొచ్చిన వారిలో ఎనిమిది మందికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు.

Recommended Video

Indian Railway News : Here Is The Details Of Trains Which Run through Telugu States

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. చాలాకాలం పాటు ఈ జిల్లా కరోనా ఫ్రీగా ఉండేది. ప్రకాశం జిల్లాలో కూడా యాక్టివ్‌గా ఉన్న కేసులు కూడా మూడే ఉన్నాయి. ఈ జిల్లాలో ఇప్పటిదాకా 63 మంది వైరస్ బారిన పడగా 60 మంది డిశ్చార్జి అయ్యారు. అత్యధిక యాక్టివ్ కేసులు కర్నూలు-292, కృష్ణా-187, గుంటూరు-181 ఉన్నాయి. అత్యధిక డిశ్చార్జిలు కూడా ఈ మూడు జిల్లాల్లోనే నమోదు అయ్యాయి.

English summary
Newly 38 Covid-19 Coronavirus positive cases have been reported in Andhra Pradesh. The total number have reached 2018. Total 998 Covid-19 patience have discharged from various isolation wards. Active cases is 975. 45 patience were died due to the Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X