అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ సారి ఏపీని దెబ్బకొట్టిన గల్ఫ్ కంట్రీస్: కువైట్, దుబాయ్ ఎఫెక్ట్: అక్కడి నుంచి వచ్చిన వారిలో

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. అడ్డు అదుపు లేకుండా చెలరేగుతోంది. రాష్ట్రంలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గంటగంటకూ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప.. ఎక్కడా అడ్డుకట్ట పడట్లేదు. మొదట్లో తబ్లిగి జమాతీలు.. ఆ తరువాత కోయంబేడు మార్కెట్ దెబ్బకు రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోగా.. ఈ సారి ప్రవాసాంధ్రుల ప్రభావం పడింది. కేసులు పెరగడానికి కారణమైంది.

Recommended Video

Covid-19 : Andhra Pradesh Effected By Gulf Countries,Cases Reaches 2627 Mark In AP

ఏడాది పాలన: జనగళాన్ని వినడానికి జగన్ రెడీ: ఏపీలో మరో ప్రోగ్రామ్: అయిదు రోజుల పాటుఏడాది పాలన: జనగళాన్ని వినడానికి జగన్ రెడీ: ఏపీలో మరో ప్రోగ్రామ్: అయిదు రోజుల పాటు

24 గంటల్లో 66

24 గంటల్లో 66

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 66 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2627కు చేరింది. ఇందులో 1807 మంది వేర్వేరు ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డుల నుంచి డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారు. మరో 56 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఫలితంగా యాక్టివ్‌గా ఉన్న కేసుల లెక్క 764గా తేలింది. వారంతా చికిత్స పొందుతున్నారు. వచ్చే 24 గంటల్లో కనీసం 50 మంది వరకు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రవాసాంధ్రుల ప్రభావం..

ప్రవాసాంధ్రుల ప్రభావం..

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులు ఏపీకి చేరుకుంటోన్న విషయం తెలిసిందే. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వందేభారత్, సముద్ర సేతు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కోసం వెళ్లి.. కరోనా వైరస్ వల్ల అమలు చేస్తోన్న లాక్‌డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయిన వారిని స్వరాష్ట్రాలకు తరలిస్తోంది. దీనికోసం వందేభారత్ పేరుతో ప్రత్యేకంగా విమానాలను నడిపిస్తోంది. సముద్రసేతు పేరుతో నౌకలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

17 కేసులు అక్కడి నుంచి వచ్చినవే..

17 కేసులు అక్కడి నుంచి వచ్చినవే..

గల్ఫ్ దేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారిలో 17 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో కువైట్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 12 మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురిలో, ఖతర్ నుంచి వచ్చిన ఇద్దరిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. వారిని ఆసుపత్రులకు తరలించామని, చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ 17 మంది కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తున్నామని అన్నారు.

150కి పైగా పొరుగు రాష్ట్రాల వారే..

150కి పైగా పొరుగు రాష్ట్రాల వారే..

కుటుంబ సభ్యులతో పాటు ఇంటికి వచ్చిన తరువాత ఎవరెవర్ని కలిశారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. గ్రామ వలంటీర్లు, ఆశా కార్యకర్తలతో సర్వే చేయిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2627 కేసుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి వైరస్ బారిన పడిన వారి సంఖ్య కూడా భారీగా ఉంటోంది. ఇప్పటిదాకా 150 మందికి పైగా వలస కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. 110 కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారివేనని చెప్పారు.

English summary
Newly 66 Covid-19 Coronavirus positive cases have been reported in Andhra Pradesh last 24 hours. The total number reached as 2627. Total active cases have registered as 764 and 56 deaths. Remaining 1807 patients were discharged from hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X