వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూస్ 24-టుడేస్ చాణక్య: టీడీపీకి 17 లోక్ సభ స్థానాలు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : న్యూస్ 24-టుడేస్ చాణక్య టీడీపీకి 17 లోక్ సభ స్థానాలు | Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశ ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డ‌వుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వ‌స‌నీయంగా భావిస్తోన్న టుడేస్ చాణ‌క్య త‌న అంచ‌నాల‌ను వెల్ల‌డించింది. గుజ‌రాత్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హ‌ర్యానా, న్యూఢిల్లీలో బీజేపీ అన్ని సీట్ల‌ను స్వీప్ చేయ‌బోతోంద‌ని పేర్కొంది. ద‌క్షిణాదిలో క‌ర్ణాట‌క మిన‌హా మిగిలిన రాష్ట్రాలు కాంగ్రెస్‌కు అండ‌గా నిలుస్తున్నాయ‌ని వెల్ల‌డించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ త‌న స్థానాల‌ను మ‌రింత మెరుగు ప‌ర్చుకుంటుంద‌ని న్యూస్ 24-టుడేస్ చాణ‌క్య సర్వే వెల్ల‌డించింది. మొత్తం 25 స్థానాల్లో టీడీపీ క‌నీసం 17 సీట్ల‌లో త‌న ఖాతాలో వేసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల‌కు ప‌రిమితం అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేసింది.

తెలంగాణ‌లో 17 సీట్ల‌ల్లో టీఆర్ఎస్ 14 నుంచి 16 సీట్లు గెలుచుకోవ‌చ్చ‌ని వెల్ల‌డైంది. కాంగ్రెస్‌, బీజేపీ, మ‌జ్లిస్ ఒక్కో స్థానాన్ని గెలుచుకోవ‌డానికి అవ‌కాశాలు ఉన్న‌ట్లు తేలింది.

కేర‌ళ‌లో మొత్తం 20 లోక్‌స‌భ స్థానాలు ఉండ‌గా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్ క‌నీసం 16 సీట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంటుంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది. మిగిలిన నాలుగు స్థానాల‌ను లెఫ్ట్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్ గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేసింది.

News 24-Todays Chanakya: TDP will get 17 Lok Sabha seats out of 25 in Andhra Pradesh

త‌మిళ‌నాడులో మొత్తం 38 లోక్‌స‌భ స్థానాల‌కు గాను కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న డీఎంకే 31 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని తేలింది. మిగిలిన ఏడు స్థానాల్లో అన్నా డీఎంకే పాగా వేస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

క‌ర్ణాట‌క‌లో 28 సీట్లలో కాంగ్రెస్ పార్టీ భారీగా న‌ష్ట‌పోతుంద‌ని స్ప‌ష్ట‌మైంది. 28 స్థానాల‌కు గాను అయిదు సీట్ల‌కు ప‌రిమితం కావ‌చ్చ‌ని తేలింది. క‌ర్ణాట‌క‌లో బీజేపీ 23 సీట్ల‌లో జెండా పాతే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంచ‌నా వేసింది.

రాజ‌స్థాన్‌లో 25 సీట్లు ఉండ‌గా.. వాటిల్లో అన్నింటినీ బీజేపీ గెలుచుకుంటుంద‌ని న్యూస్ 24-టుడేస్ చాణ‌క్య సర్వే తేట‌తెల్లం చేసింది. మ‌ధ్యప్ర‌దేశ్‌లో కూడా బీజేపీ హ‌వా వీచింద‌ని స్ప‌ష్ట‌మైంది. ఈ రాష్ట్రంలో మొత్తం 29 స్థానాల‌కు అన్నింటినీ గెలుచుకోవ‌డానికి అవకాశం ఉంద‌ని స్ప‌ష్ట‌మైంది.

అస్సాంలో మొత్తం 14 స్థానాలు ఉండ‌గా.. ప‌దింటిలో బీజేపీ పాగా వేయ‌గా.. మిగిలిన నాలుగింటిని కాంగ్రెస్ గెలుచుకోవ‌చ్చ‌ని స‌ర్వే తేలింది.

గుజ‌రాత్‌-26, హ‌ర్యానా-10, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌-11, న్యూఢిల్లీ-7 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని తెలియ‌జేసింది. ఇందులో అయిదు నుంచి ఆరు సీట్లు అటు ఇటుగా ఉంటాయ‌ని వెల్ల‌డించింది.

English summary
News 24-Today's Chanakya Exit Polls predict that BJP will face struggle in Southern States like Kerala, Tamil Nadu and Andhra Pradesh. Congress will gain in Kerala and Tamil Nadu. BJP will get mejority seats in Karnataka. Gujarat, Haryana, Chhattisgarh and New Delhi. BJP will get more seats than 2014 News 24-Today's Chanakya Exit Polls predict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X