• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కెఈ ఫ్యామిలీ టీడీపీకి దూరంగా : భరత్‌కు‌ బుజ్జగింపులు : వీరి అడుగులు ఎటువైపు ..!!

By Lekhaka
|

టీడీపీలో ఏం జరుగుతోంది. పార్టీ సీనియర్లలో ఎందుకీ ఆక్రోశం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ ఇంకా పూర్తి కాకుండానే..కర్నూలు జిల్లాలో మరో సీనియర్ నేత కుటుంబం టీడీపీ అధినాయకత్వ తీరు పైన గుర్రుగా ఉంది. చంద్రబాబు సమకాలీకుడుగా పార్టీలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తితో పాటుగా ఆయన సోదరులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉన్న కేఈ క్రిష్ణమూర్తి గత ఎన్నికల్లో తన కుమారుడికి పత్తికొండ టిక్కెట్ టీడీపీ నుంచి ఇప్పంచుకున్నారు.

 కేఈ ప్యామిలీ రూటు మారుతోందా..

కేఈ ప్యామిలీ రూటు మారుతోందా..

అయితే, 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని మొత్తం 14 సీట్లు.. రెండు లోక్ సభ సీట్లు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో..టీడీపీ నేతలు పూర్తిగా అంతర్మధనంలో పడ్డారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని టీడీపీలో కి తీసుకోవటం పైన కేఈ సోదరులు ఓపెన్ గానే తమ అభ్యంతరం వ్యక్తం చేసారు. రాజకీయంగా వారి పైన పోరాటం చేసి..ఇప్పుడు తిరిగి వారితో కలిసి పని చేయటం కష్టమని స్పష్టం చేసారు. దీనికి చంద్రబాబు ఆ సమయంలో వారిని బుజ్జగించారు.

 టీడీపీలో కొనసాగలేరంటున్న అనుచరులు..

టీడీపీలో కొనసాగలేరంటున్న అనుచరులు..

ఇక, బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలనే లక్ష్యంగా కెఇ క్రిష్ణమూర్తికి ఉప ముఖ్యమంత్రి -రెవిన్యూ శాఖను అప్పగించారు. అయినా, కీలకమైన అమరావతి వ్యవహారాల్లో ఆయనకు ప్రాధాన్యత లేకపపోవటం పైన కెఇ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. పూర్తిగా మున్సిపల్ మంత్రి నారాయణకే బాధ్యతలు అప్పగించటం కెఈ కి రుచించలేదు. 2020 లో ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో టీడీపీ అధినాయకత్వం ఆయన్ను బుజ్జగించింది. ఇక, 2019 ఎన్నికల తరువాత జిల్లాలో పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు జోష్ నింపే విధంగా నిర్వహించలేదు.

 టీడీపీ కార్యక్రమాలకు దూరంగా..

టీడీపీ కార్యక్రమాలకు దూరంగా..

పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీలు వైఎస్సార్‌సీపీ వశమయ్యాయి. 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ సైకిల్‌ దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. ఆయన కుమారుడు టీజీ భరత్‌ మాత్రం టీడీపీలో అంటీముట్టనట్లు కొనసాగుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు కేఈ బ్రదర్స్ హాజరు కావడం లేదు. దీంతో..కేఈ ఫ్యామిలీ టీడీపీకి దూరం అవుతుందనే ప్రచారం సాగుతోంది.

 వైసీపీలోకి వస్తే..హామీ ఏంటి...

వైసీపీలోకి వస్తే..హామీ ఏంటి...

వైసీపీలోకి రావటానికి నియోజకవర్గ స్థాయిలో అనేక రాజకీయ ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సద్దుబాటు చేస్తే వైసీపీలోకి రావటానికి సిద్దమనే సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా..టీజీ వెంకటేష్ తనయుడు భరత్ సైతం టీడీపీ వీడుతారనే ప్రచారం జిల్లాలో మొదలైంది. దీంతో.. టీజీ భరత్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు ఫోన్‌ చేసి బుజ్జగించినట్లు సమాచారం. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ టీడీపీ పరిస్థితి ఇదే రకంగా ఉంది. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు.

 జిల్లా నేతల నిర్ణయాల పైన ఆసక్తి..

జిల్లా నేతల నిర్ణయాల పైన ఆసక్తి..

ఇక, ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తరచూ వివాదాల్లో చిక్కుకుని కేసులు, కోర్టు వ్యవహారాల్లో మునిగిపోయారు. కుటుంబసభ్యులు కూడా ఆమెకు సహకరించని పరిస్థితి నెలకొని ఉంది. అన్ని నియోజవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండటంతో టీడీపీ లో కొనసాగటానికి ఇబ్బంది పడుతున్న ఈ నేతలు అడుగులు ఎటువైపు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Kurnool district tdp senior leader KE family is not interest to continue with own party. KE family may soon change the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X