అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు ఊరట, జగన్‌కు హెచ్చరిక: 'అమరావతి నిర్మాణంపై స్టే లేదు, అలా మాట్లాడితే..'

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పైన ఎలాంటి స్టే లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం నాడు స్పష్టం చేసింది. అమరావతి నిర్మాణం కొనసాగింపు తుది నిర్ణయానికి లోబడే ఉంటుందని ఈ సందర్భంగా ట్రైబ్యునల్ పేర్కొంది.

ఆదేశాలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది ఎన్జీటీ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై ట్రైబ్యునల్ ఘాటుగా స్పందించింది. మీడియాలో వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను తప్పుగా ప్రచారే చేయవద్దని అభిప్రాయపడింది. కాగా, రాజధాని నిర్మాణం పైన ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

NGT green signal to capital Amaravati

కాగా, స్పేస్ టెక్నాలజీలో మనమే నెంబర్ వన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐవోటీ సాయంతో పురస్కారాలను విజయవంతం చేశామని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఇస్రో అధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

విశ్వవిద్యాలయాలకు ఇస్రో సాంకేతిక సహకారం ఉంటుందని చెప్పారు. ఇస్రో సహకారంతో గ్రామస్థాయికి వాతావరణ సమాచారం అందుతుందన్నారు. సైబర్ సెక్యూరిటీ మిషన్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అన్ని విద్యాలయాల్లో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ప్రతి వర్సిటీ పరిశోధన క్షేత్రం కావాలన్నారు.

English summary
National Green Tribunal green signal to Andhra Pradesh capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X