వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వద్దన్నా సీమ లిఫ్ట్ కు కృష్ణాబోర్డు-ఎన్టీటీ ఆదేశాలు-కేసీఆర్ హెలికాఫ్టర్ ఆఫర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ విషయంలో తెలంగాణ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలే పెద్ద సవాల్ అనుకుంటున్న నేపథ్యంలో ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్ అంతకు మించి సంచలనం రేపే ఆదేశాలు ఇచ్చింది. సీమ లిఫ్ట్ పరిశీలనకు కృష్ణా రివర్ బోర్డు అధికారుల్ని జగన్ సర్కార్ అనుమతించని నేపథ్యంలో సొంతంగానే వారు అక్కడికి వెళ్లాలని ఎన్జీటీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వారికి హెలికాఫ్టర్ ఇచ్చి పంపుతామని కేసీఆర్ సర్కార్ ప్రకటించింది.

రాయలసీమ లిఫ్ట్ పై ఎన్జీటీ విచారణ

రాయలసీమ లిఫ్ట్ పై ఎన్జీటీ విచారణ

ఏపీలో ప్రతిపాదిత రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై ఇవాళ ఎన్జీటీలో ఆసక్తికరమైన వాదనలు సాగాయి. ఇందులో ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు అధికారుల్ని రాయలసీమ లిఫ్ట్ వద్దకు అనుమతించకపోవడంపై ఎన్జీటీ సీరియస్ అయింది. దీంతో ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఇందుకు తగిన కారణాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఎవ్జీటీకి తెలిపారు. అయినా ఎన్టీటీ మాత్రం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

రాయలసీమ లిప్ట్ సందర్శనకు అడ్డుగా జగన్

రాయలసీమ లిప్ట్ సందర్శనకు అడ్డుగా జగన్

రాయలసీమ ఎత్తిపోతల పథకం పై దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీమ లిఫ్ట్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై పై ఎన్ జీ టి చెన్నై బెంచ్ విచారణ జరిపింది. పిటిషనర్లు గవి నోళ్ళ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం, కృష్ణా రివర్ బోర్డు తమ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఇందులో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు సందర్శనకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని కృష్ణాబోర్డు తమ అఫిడవిట్లో పేర్కొంది. దీనిపై స్పందించిన ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపింది. అసలు ఈ సమయంలో కృష్ణాైబోర్డు పర్యటనను అనుమతించాల్సిన అవసరం లేదని తెలిపింది.

హెలికాఫ్టర్ పంపుతామన్న కేసీఆర్ సర్కార్

హెలికాఫ్టర్ పంపుతామన్న కేసీఆర్ సర్కార్

ప్రస్తుతం రాయలసీమ లిఫ్ట్ పై డీపీఆర్ తయారీకి అధ్యయనం మాత్రమే జరుగుతుందని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపింది.

కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర జలసంఘం అడిగిన అంశాలపై అధ్యయనం జరుగుతోందని వివరించింది. అయితే ఈ వాదనతో విభేదించిన తెలంగాణ సర్కార్.. ఏపీ ప్రభుత్వం సహకరించనందున ఎన్జీటీ బృందమే సందర్శించాలని కోరింది.
ఇందుకు హెలికాప్టర్ తో సహా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది. దీంతో జగన్ సర్కార్ వద్దన్నా మా హెలికాఫ్టర్ లో వెళ్లాలని తెలంగాణ సర్కార్ కోరినట్లయింది.

Recommended Video

AP Cabinet Writes To krishna River Board On Srisailam Power Issue Targeting TS Genco|Oneindia Telugu
జగన్ సర్కార్ కు ఎన్జీటీ షాక్

జగన్ సర్కార్ కు ఎన్జీటీ షాక్

కృష్ణాబోర్డు అధికారుల్ని రాయలసీమ లిఫ్ట్ వద్దకు అనుమతించకూడదన్న ఏపీ సర్కార్ నిర్ణయంపై ఎన్జీటీ ధర్మాసనం సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండానే సొంతంగా అక్కడికి వెళ్లాలని కృష్ణబోర్డును ఆదేశించింది.

ప్రాజెక్టులో తనిఖీలు జరిపి తమకు నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. కృష్ణా బోర్డు నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని జాతీయ హరిత ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో జగన్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఎన్జీటీ ఆదేశాలతో త్వరలో కృష్ణాబోర్డు రాయలసీమ లిఫ్ట్ పర్యటనకు సిద్దమవుతోంది.

English summary
national green tirbunal on today orders kirishna river board to visit rayalaseema lift in andhrapradesh without jagan govt's help.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X