వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంపై ఎన్టీటీ తీవ్ర వ్యాఖ్యలు- ఉత్తరాఖండ్‌ తరహా ముప్పు- నిపుణుల కమిటీ ఏర్పాటు

|
Google Oneindia TeluguNews

పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇవాళ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న లోపాలపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా పర్యవేక్షణ కోసం ఓ నిపుణుల కమిటీని కూడా నియమించాలని నిర్ణయించింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ప్రణాళికలను లోపభూయిష్టంగా రూపొందించినట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలిపింది. పర్యావరణ సమస్యలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు హరిత ట్రైబ్యునల్‌ పేర్కొంది. పదే పదే సమస్యలు తలెత్తడానికి పర్యావరణ లోపాలే కారణమని ఎన్జీటీ తెలిపింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్తరాఖండ్‌లో తాజాగా చోటు చేసుకున్న ప్రళయం ఏపీలోనూ రిపీట్‌అవుతుందని హెచ్చరించింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అంశాల పర్యవేక్షణకు ఓ నిపుణుల కమిటీని త్వరలో నియమించనుంది.

ngt serious on environment violations in polavaram, appoint panel with retired hc judge

పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ అంశాల పర్యవేక్షణ కోసం నియమించే కమిటీకి హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వం వహించనున్నారు. అలాగే ఈ కమిటీలో వివిధ ఐఐటీ ఐఐఎస్ఆర్‌ నిపుణులకు కూడా స్ధానం కల్పిస్తారు. ఈ నిపుణులు ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అంశాలపై దృష్టిసారిస్తారు. వీరి నివేదికల ఆధారంగా ఏపీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ప్రాజెక్టు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పర్యావరణ అంశాల ఉల్లంఘన విషయంలో ఎన్టీటీ కమిటీ ఏర్పాటు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
national green tribunal on tuesday raises objections over environmental violations in construction of polavaram national project and decided to appoint an expert panel heading a retired judge of high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X