వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్లలో ఐదు గ్రీన్ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు- ఏపీకి ఉత్తరాదితో పెరగనున్న కనెక్టివిటీ..

|
Google Oneindia TeluguNews

దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతమున్న వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు మిగతా రాష్ట్రాలతో పాటు ఉత్తరాదితోనూ అనుసంధాన్ని భారీగా పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే విధంగా ఐదు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలను అభివృద్ధి చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టు విజయవంతమైతే పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదితోనూ కనెక్టివిటీ గణనీయంగా పెరగబోతోంది. ప్రయాణ సమయం భారీగా తగ్గడంతో పాటు వాహనాల వేగం కూడా పెరగనుంది.

ఐదేళ్లలో ఐదు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలు..

ఐదేళ్లలో ఐదు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలు..

ఏపీలో ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని రవాణాకు వాడుకునేందుకు వీలుగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ భారీ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఉత్తరాదితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి కనెక్టివిటీని మరింత పెంచడం ద్వారా సరకు రవాణాతో పాటు ప్రయాణాన్ని కూడా సులభతరం చేసే లక్ష్యంతో ఓ కొత్త ప్లాన్‌ ప్రతిపాదించింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి ఐదు రహదారులను గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలుగా అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఇది యథాతథంగా ఐదేళ్లలో పూర్తయితే పొరుగు రాష్ట్రాతో పాటు ఉత్తరాదితోనూ ఏపీకి అనుసంధానం గణనీయంగా పెరగబోతోంది. ఇందుకోసం అన్ని అనుమతులను కేంద్రం మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

ఐదు ఎక్స్‌ప్రెస్‌వేలు ఇవే...

ఐదు ఎక్స్‌ప్రెస్‌వేలు ఇవే...

జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ అభివృద్ధి చేయనున్న ఐదు రహదారులను తాజాగా నిర్ణయించారు. వీటిలో విశాఖ-రాయ్‌పూర్‌ మార్గం. విశాఖపట్నంలోని సబ్బవరం నుంచి ప్రారంభమై కొత్తవలస, విజయనగరం, సాలూరు మీదుగా ఒడిశా సరిహద్దుల వరకూ ఈ హైవే నిర్మిస్తారు. మన రాష్ట్రంలో వంద కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి రూ.2300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరాపల్లి నుంచి తెలంగాణలోని ఖమ్మం మీదుగా సూర్యాపేట సమీపంలోని లింగగూడెం వరకూ మరో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించనున్నారు. అలాగే విజయవాడ నుంచి నాగ్‌పూర్‌ వెళ్లే మరో ఎక్స్‌ప్రెస్‌వే ఖమ్మం-విజయవాడ మధ్య 91 కిలోమీటర్ల దూరంలో రూపుదిద్దుకోనుంది. ఇందులో ఏపీలో 31 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. అలాగే చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి కడప వరకూ 100 కిలోమీటర్ల ఫోర్‌ లైన్‌ రోడ్డు నిర్మించడం ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచుతారు. చివరిగా చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు వరకూ మరో ఎక్స్‌ప్రెస్ హైవే రూపుదిద్దుకోనుంది.

దూరం తగ్గేది ఇలా....

దూరం తగ్గేది ఇలా....

విశాఖ- రాయ్‌పూర్‌ మార్గం వల్ల ఒడిషా మీదుగా ఛత్తీస్‌ఘడ్‌కు వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. విజయవాడ-నాగ్‌పూర్‌ మార్గం వల్ల ప్రస్తుత సూర్యాపేట, హైదరాబాద్‌ కాకుండా ఖమ్మం, మంచిర్యాల మీదుగా వేగంగా చేరుకోవచ్చు. అలాగే రేణిగంట-కడప మార్గం వల్ల చెన్నై నుంచి సూరత్‌కు దూరం తగ్గించి వేగంగా చేరుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే చిత్తూరు-తచ్చూరు మార్గం అభివృద్ధి చేయడం వల్ల బెంగళూరు, చిత్తూరు నుంచి సరకు రవాణా వాహనాలు చెన్నైలోని పోర్టులకు వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే దేవరాపల్లి- సూర్యాపేట మార్గం వల్ల ఉత్తర కోస్తా నుంచి హైదరాబాద్‌కు వాహనాలు వేగంగా చేరుకునేందుకు వీలు పడుతుంది. ఈ మార్గం పూర్తయితే విశాఖ నుంచి బయలుదేరే వాహనం ఐదు గంటల్లోనే హైదరాబాద్‌ చేరుకునేందుకు అవకాశం ఉంటుంది.

Recommended Video

Reopening of Schools and Colleges ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచనే లేదు !
గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలు.

గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలు.


గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం ద్వారా ప్రస్తుతం వివిధ ప్రాంతాల మధ్య ఉన్న దూరం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు ప్రయాణ సమయం కూడా భారీగా కలిసి వస్తుంది. ఆ మేరకు సరకు రవాణా వ్యయం కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఉన్న హైవేలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వీటిని నిర్మిస్తారు. రోడ్డుపై కనీసం 100-120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ రోడ్లపైకి స్ధానిక గ్రామాల నుంచి అన్నిచోట్లా వాహనాలు అనుమతించరు. అవసరమైన చోట్ల టోల్‌గేట్లు ఉంచినా అంతిమంగా ప్రయాణ సమయం తగ్గించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తారు.

English summary
national highways authority of india plans to develop five greenfield highways in andhra pradesh in five years to improve connectivity with northern and neighbouring states also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X